టీవీ ప్రేక్షకాదరణ పెరగటానికి వర్క్ ఫ్రమ్ హోమ్ కారణమా?

0
516

కోవిడ్ కు ముందు, కోవిడ్ సమయంలో, సడలింపులు అమలయ్యాక టీవీ ప్రేక్షకాదరణలో వచ్చిన మార్పులు గమనిస్తే అనేక విషయాలు అర్థమవుతున్నాయి. రాత్రి 6 గంటలు మొదలుకొని12 గంటలవరకు ప్రైమ్ టైమ్ గా భావిస్తుండగా కోవిడ్ కు ముందు ఉన్న ప్రేక్షకాదరణ కోవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు బాగా పెరిగి ఇప్పుడు సడలింపులు ఎక్కువగా అమలులోకి వచ్చిన తరువాత మళ్ళీ పాత స్థాయికే చేరుకోవటం గమనించవచ్చు.
అంటే, ప్రైమ్ టైమ్ ప్రేక్షకాదరణ పూర్వస్థితికి చేరింది. కానీ నాన్ ప్రైమ్ టైమ్ విషయానికొస్తే, ఆసక్తికరమైన అంశం గుర్తించవచ్చు. కోవిడ్ గరిష్టంగా ఉన్నప్పుడు ప్రైమ్ టైమ్ కంటే నాన్ ప్రైమ్ టైమ్ లోనే ఎదుగుదల శాతం చాలా ఎక్కువగా ఉంది. దీని అర్థం పగటి పూట ప్రేక్షకాదరణ గరిష్టంగా పెరిగింది. ఆ పెరుగుదల 80% ఉందంటేనే అది ఎంత స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే, ఇప్పుడు సడలింపుల కాలంలో తాజా వారం ప్రేక్షకాదరణ గమనిస్తే తగ్గుదల కనిపిస్తుంది. కానీ ప్రైమ్ టైమ్ తరహాలో మళ్ళీ మామూలు స్థితికి రాకుండా కొద్దిపాటి తగ్గుదలే నమోదు కావటం గమనించినప్పుడు అది కచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రభావమేనని అర్థమవుతోంది. కోవిడ్ నిబంధనలు సడలించినా, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతూ ఉండటం వలన పగటి పూట కూడా టీవీ చూడటం కోవిడ్ ముందు కంటే ఎక్కువగా ఇప్పుడూ ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది.
టీవీ ప్రేక్షకాదరణను కొలిచే బ్రాడ్ కాస్ట ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ఇండియా సీఈవో సునిల్ లల్లా ఈ తాజా సమాచారాన్ని అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here