3 నెలల్లో 15 లక్షల కనెక్షన్లు కోల్పోయిన కేబుల్ రంగం

0
1082

కేబుల్ పరిశ్రమ ప్రమాదంలో పడుతున్నదనటానికి నిదర్శనంగా ఈ రంగంలో కనెక్షన్లు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఒకవైపు డీటీహెచ్ కొన్ని కనెక్షన్లు లాక్కుంటూ కలవరపెడుతుంటే మరోవైపు ఓటీటీ ముప్పు ముంచుకొస్తున్నది. డీటీహెచ్ సైతం 9 లక్షల కనెక్షన్లు పోగొట్టుకున్నదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా కనెక్షన్లు ఉన్న ఎమ్మెస్వోల లెక్కలే 3 నెలల్లో 6 లక్షలు తగ్గినట్టు చూపుతున్నాయి. అంటే, మొత్తం సంఖ్య కచ్చితంగా అంతకు రెట్టింపుకంటే ఎక్కువే ఉంటుంది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) విడుదల చేసిన జూన్-సెప్టెంబర్ సమాచారం ప్రకారం 10 లక్షల కనెక్షన్లకంటే ఎక్కువ ఉన్న 13 సంస్థలే 5 లక్షల కనెక్షన్లు కోల్పోయాయి. దేశవ్యాప్తంగా 1745 మంది ఎమ్మెస్వోలు లైసెన్స్ పొందినవారుండగా మొదటి 13 సంస్థలే 2021 జులై-సెప్టెంబర్ మధ్య మూడు నెలల కాలంలో 6 లక్షల కనెక్షన్లు పోగొట్టుకున్నాయి. అందువలన మొత్తం కేబుల్ కనెక్షన్లు కనీసం 15 లక్షలు తగ్గి ఉంటాయి.
వివిధ ఎమ్మెస్వోల మధ్య పోటీ విషయానికొస్తే, అంతకుముందు మొదటి స్థానంలో ఉన్న సిటీ నెట్ వర్క్స్ ను కిందికి నెట్టి జీటీపీఎల్ హాత్ వే మొదటి స్థానంలోకి వచ్చింది. నిజానికి రెండు సంస్థలూ కనెక్టివిటీ కోల్పోయినా, సిటీ నెట్ వర్క్స్ ఎక్కువ కోల్పోవటం వలన మాత్రమే రాంకులు మారటం గమనార్హం. సిటీ నెట్ వర్క్స్ కనెక్షన్లు 76 లక్షల 40 వేలు కాగా జీటీపీఎల్ హాత్ వే కనెక్షన్లు 77 లక్షల 90 వేలు. జులై-సెప్టెంబర్ మధ్య మొత్తంగా కేబుల్ కనెక్షన్లు తగ్గినా, తమిళగా కేబుల్ టీవీ కమ్యూనికేషన్, కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్, వికె డిజిటల్ నెట్వర్క్ మాత్రమే కొద్దిపాటి పెరుగుదల కనబరచాయి.
2021 సెప్టెంబర్ 30 నాటికి ఎమ్మెస్వోలు, హిట్స్ ఆపరేటర్ల కనెక్టివిటీ జాబితాలో పైన ఉన్న సంస్థల వివరాలు ఇలా ఉన్నాయి: జీటీపీఎల్ హాత్ వే (7,799,167), సిటీ నెట్వర్క్స్ (7,649,554), హాత్ వే డిజిటల్ (5,505,062), డెన్ నెట్వర్క్స్ (4,670,618), తమిళగ కేబుల్ టీవీ కమ్యూనికేషన్స్ (3,762,040), కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ (2,935,006), తమిళనాడు అరసు కేబుల్ టీవీ కార్పొరేషన్ (2,789,971), ఫాస్ట్ వే ట్రాన్స్ మిషన్స్ (2,149,610), కల్ కేబుల్స్ (2,123,566), ఎన్ ఎక్స్ టి డిజిటల్ – హిట్స్ (2,005,747), వికె డిజిటల్ నెట్ వర్క్ (1,906,348), ఏషియానేట్ డిజిటల్ నెట్వర్క్ (1,175,658), ఎన్ ఎక్స్ టి డిజిటల్- కేబుల్ టీవీ (1,056,902).
అంతకుముందు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇవే సంస్థల కనెక్టివిటీ ఈ విధంగా ఉంది: సిటీ నెట్ వర్క్స్ (7,861,314), జీటీపీల హాత్ వే (7,833,694), హాత్ వే డిజిటల్ (5,603,942), డెన్ నెట్వర్క్స్ (4,862,741), తమిళగ కేబుల్ టీవీ కమ్యూనికేషన్ (3,693,943), కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ (2,889,439), తమిళనాడు అరసు కేబుల్ టీవీ కార్పొరేషన్ (2,885,583), ఫాస్ట్ వే ట్రాన్స్ మిషన్స్ (2,195,619), కల్ కేబుల్స్ (2,081,801), ఎన్ ఎక్స్ టి డిజిటల్ – హిట్స్ (2,025,202), వికె డిజిటల్ నెట్ వర్క్ (1,845,823), ఏషియానెట్ డిజిటల్ నెట్వర్క్ (1,208,681), ఎన్ ఎక్స్ టి డిజిటల్- కేబుల్ టీవీ (1,105,650).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here