రేటింగ్స్ కేసు: అరెస్ట్ కు 3 రోజులు ముందే చెప్పండి

0
565

రోజురోజుకూ అనేక మలుపులూ తిరుగుతున్న రేటింగ్స్ కుంభకోణం కేసులో రిపబ్లిక్ టీవీ అధిపతి ఆర్ణబ్ గోస్వామికి ఉచ్చు బిగుసుకుంటూ ఉండగా ఆయనను అరెస్ట్ చేయాలంటే మూడు రోజులు ముందుగా నోటీస్ ఇవ్వాలని బొంబాయ్ హైకోర్ట్ ఈరోజు ముంబయ్ పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో ఈ కేసు దర్యాప్తును మూడు నెలల్లోగా పూర్తి చేస్తామని ముంబయ్ పోలీసులు ఈ రోజు హైకోర్టుకు తెలియజేశారు.
రిపబ్లిక్ టీవీ, ఆ సఠ అధిపతి ఆర్ణబ్ గోస్వామి దాఖలు చేసుకున్న పిటిషన్ ను ఈరోజు బొంజస్టిస్ ఎస్ ఎస్ షిండే, జస్టిస్ మనీష్ పితాలే తో కూడిన బొంబాయ్ హైకోర్ట్ డివిజన్ బెంచ్ విచారించింది. పోలీసుల విచారణను, ఎఫ్ ఐ ఆర్ ను, కోర్టు విచారణను, చార్జ్ షీట్ ను పిటిషనర్ సవాలు చేశారు. అదే సమయంలో ఈ కేసులు సిబిఐ లేదా మరేదైనా స్వతంత్ర విచారన సంస్థకు బదలీ చేయాలని కూడా కోరారు.
ముంబయ్ పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ కేవలం రిపబ్లిక్ టీవీని, ఆర్ణబ్ ను లక్ష్యంగా చేసుకున్నదని, గతంలో మహారాష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసినందుకే కక్షసాధింపుకు పాల్పడుతున్నారని ఆర్ణబ్ తరఫు న్యాయవాది ఆరోపించారు. మిగతా చానల్స్ పేర్లు ప్రస్తావించినా, తన క్లయింట్ చానల్ సిబ్బందిని మాత్రమే నాలుగు నెలలుగా విచారిస్తున్నారని, అయినా, ఎలాంటి ఆధారమూ సంపాదించలేకపోయారని కోర్టుకు ఫిర్యాదు చేశారు.
ఇలా దర్యాప్తు నిరవధికంగా కొనసాగటానికి వీల్లేదని, ఎక్కడో ఒకచోట ఆగాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది. అయితే, విచారణకు పిలిచినపుడు పిటిషనర్ ఆర్ణబ్ గోస్వామి దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాల్సిందేనని చెబుతూ, అతడిని అరెస్ట్ చేయాలంటే మాత్రం మూడు రోజులు ముందుగా నోటీస్ ఇవ్వాలని ముంబయ్ పోలీసులను కోర్టు ఆదేశించింది. నిందితులెవరో ఇంకా నిర్థారణ కావాల్సి ఉన్నందున దర్యాప్తును ఆపబోవటం లేదని కూడా కోర్టు స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here