కోవిడ్ హెల్ప్ లైన్స్ కు ప్రచారమివ్వాలని చానల్స్ ను కోరిన కేంద్రం

0
494

కోవిడ్ హెల్ప్ లైన్ నెంబర్లకు ప్రచారం కల్పించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ కు విజ్ఞప్తి చేసింది. దేశం అత్యంత ఘోరమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సమయంలో రోజుకు సగటున 2500 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ గుర్తు చేసింది. జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ ఆరు జాతీయ స్థాయి హెల్ప్ లైన్ నెంబర్లకు తరచూ ప్రచారం కల్పించటం ద్వారా ప్రజలలో అవగాహన, చైతన్యం పెంచాలని సూచించింది.
అందులో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖవారి 1075, మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ వారి 1098, మానసిక అంశాలలో మద్దతునిచ్చే నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ వారి 08046110007 ఉన్నాయి. అదే విధంగా ఆయిష్ కోవిడ్ 19 కౌసిలింగ్ నెంబర్ 14443, మైగవ్ వాట్సాప్ హెల్ప్ డెస్క్ నెంబర్ 9013151515, వృద్ధులకోసం సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ వారి 14567 నెంబర్ కు కూడా ప్రచారం కల్పించాలని కోరింది.
దేశంలో కరోనా రెండో కెరటం తగ్గుముఖం పడుతున్న సంకేతాలిస్తున్నప్పటికీ కొత్త కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉందని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఈ సలహాలో పేర్కొంది. ప్రభుత్వ కృషికి ప్రైవేట్ చానల్స్ ఇప్పటికే అండజా నిలబడ్దాయనై అభినందిస్తూ, ఇన్ఫెక్షన్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ను తరచు ప్రసారం చేయటం ద్వారా మరింతమంది సేవలు వినియోగించుకునేలా చూడాలని కోరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here