ఏపీఎస్ ఎఫ్ ఎల్ చైర్మన్ గా పూనూరు గౌతమ్ రెడ్డి

0
304

ఏపీఎస్ ఎఫ్ ఎల్ ఛైర్మన్ గా పి. గౌతమ్ రెడ్డి ని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 12 న ఆశాలు జారీచేసింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2015 అక్టోబర్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇంటింటికీ చౌకగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో ఏర్పాటైన ఈ సంస్థ ట్రిపుల్ ప్లే పేరిట ఫోన్, ఇంటర్నెట్, ఐపిటీవీ ఇవ్వటం ప్రారంభించింది. ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం, విద్యాసంస్థలకు డిజిటల్ పాఠాలు అందించటంతోబాటు కేబుల్ రంగంలో కూడా ప్రవేశించింది.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 లక్షల కేబుల్ కనెక్షన్లు ఉన్న ఎపి ఎస్ ఎఫ్ ఎల్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియని అయోమయ స్థితిలో ఆపరేటర్లు ఇబ్బందులు పడుతూ ఉండగా ఈ సంస్థకు ఇప్పుడు గౌతమ్ రెడ్డి చైర్మన్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్న గౌతం రెడ్డి. విజయవాడలో సిటీ కేబుల్ ప్రారంభం నుండి కేబుల్ ఆపరేటర్ల నాయకుడుగా సమస్యల పరిస్కారంలో చొరవ చూపేవాడు. ఇప్పుడు ఆయన చైర్మన్ హోదాలో ఫైబర్ నెట్ ఆపరేటర్ల సమస్యలు కూడా పరిష్కరిస్తారని ఆశిస్తున్నారు.
ఇలా ఉండగా ఆయన ఈ నెల 18న సోమవారం ఉదయం 11 గంటలకు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయవాడ తుమ్మల పల్లి కళాక్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమం అనంతరం జరిగే అభినందన సభలో లో డిప్యూటీ సీఎం అంజద్ బాషాతోబాటు మంత్రులు పెద్దిరెద్ది రామచంద్రారెడ్ది, మేకపాటి గౌతం రెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, జోగి రమేశ్, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here