జంధ్యాల పాపయ్య శాస్త్రి

0
2665

జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగస్టు 41912 – జూన్ 211992) 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, “కరుణశ్రీ” అని ప్రసిద్దులైనారు.

కరుణశ్రీ గారి అత్యంత ప్రముఖ కావ్యాలు “పుష్పవిలాపము”, “కుంతి కుమారి” అని అనవచ్చును. ఈయన కవితాత్రయము అయిన ‘ఉదయశ్రీ’, ‘విజయశ్రీ’,, ‘కరుణశ్రీ’ అత్యధిక ముద్రణలు కలిగి, ఎనలేని ఖ్యాతి గాంచినవి. పై మూడింటిని తన సున్నిత హృదయము, తర్కమునకుప్రతీక అయిన తన మెదడు,, తన విలువైన జీవితమని అభివర్ణిస్తారు. ఈ మూడు రచనలు, కరుణశ్రీ గారి ప్రకారము సత్యం, శివం,, సుందరం యొక్క రూపాంతరాలుగా పరిగణిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here