భారత కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య మార్గదర్శకాలు

0
275

సెట్ టాప్ బాక్స్ ఎలా పనిచేస్తుందో, ఏయే ఫీచర్లు ఉన్నాయో ఆపరేటర్లు తెలుసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు. పైగా, చందాదారులను తప్పుదారిపట్టించారన్న అపవాదు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే, భారత కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య ( Cable Operators’ Federation of India – COFI ) ఆపరేటర్లకు అవగాహన కల్పించి అప్రమత్తంగా ఉంచటానికి కొన్ని మార్గదర్శకాలు రూపొందించి అందిస్తోంది. డిజిటల్ అడ్రెసిబుల్ సిస్టమ్ (DAS) అమలు చేయాలంటే ఒక సెట్ టాప్ బాక్స్ లో ఉండాల్సిన కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ (CAS ), సబ్ స్క్రైబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ( SMS ) ఎలా ఉండాలో అందులో వివరించింది.
ఎ. సెట్ టాప్ బాక్స్ అవసరాలు

 1. ప్రతి సెట్ టాప్ బాక్స్ లోనూ కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ( CAS) అంతర్గతంగా ఇమిడి ఉండాలి. అంటే, చందాదారుడు తాను ఎంచుకున్న చానల్స్ మాత్రమే చూడగలిగే వెసులుబాటు కల్పించే వ్యవస్థ.
 2. అదే విధంగా డిజిటల్ హెడ్ ఎండ్ అమర్చిన కండిషనల్ యాక్సెస్ విధానాన్ని ఆ సెట్ టాప్ బాక్స్ డీక్రిప్ట్ చేసుకోగలగాలి.
 3. బహిరంగంగానూ, రహస్యంగానూ ఫింగర్ ప్రింటింగ్ చేయగల సామర్థ్యం సెట్ టాప్ బాక్స్ కి ఉండాలి. ఈ బాక్స్ అటు ఇసిఎమ్ ఆధారిత ఫింగర్ ప్రింటింగ్ కి, ఇటు ఇఎమ్ ఎమ్ ఆధారిత ఫింగర్ ప్రింటింగ్ కి అనుకూలంగా ఉండాలి. ( ఇసిఎమ్ ఆధారిత ఫింగర్ ప్రింటింగ్ అయితే ఫింగర్ ప్రింట్ టైమ్ షెడ్యూలింగ్ లో సమస్యలు తలెత్తవచ్చు )
 4. సెట్ టాప్ బాక్స్ నుంచి వచ్చే డిజిటల్ ఔట్ పుట్ హెచ్ డి టీవీకి తగినట్టు హెచ్ డి ఎమ్ ఐ మీద ఉండి టీవీ వరకు కాపాడబడుతుంది. కానీ టీవీ సెట్ కి కూడా అవే ఇన్ పుట్స్ ఉండాలి. అంటే, హెచ్ డి సి పి మీద హెచ్ డి ఎం ఐ. ఈ దశలో ప్రసారాలు కాపీ జరగకుండా చూసే సామర్థ్యం దానికి ఉండాలి. అయితే, కాపీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చానల్ యజమానిదే. ఎందుకంటే, మాక్రోవిజన్ లాంటివి కూడా కాపీని, హాకింగ్ ని, పైరసీని నిరోధించలేకపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలి.
 5. ఒక్కో బాక్స్ విడివిడిగా హెడ్ ఎండ్ తో అనుసంధానమై ఉండాలి. అంటే ఏ ఒక బాక్స్ కైనా విడిగా సమాచారం పంపితే అది అందుకోగలగాలి. అందుకోసమే ఒక్కో బాక్సులోనూ ప్రత్యేకమైన స్మార్ట్ కార్డ్ పెడతారు
 6. హెడ్ ఎండ్ నుంచి వచ్చే సమాచారాన్ని అందుకోవటంతోబాటు దాన్ని ప్రదర్శించగలిగే సామర్థ్యం సెట్ టాప్ బాక్స్ కి ఉండాలి.
 7. మెసేజ్ లో కనీసం 120 అక్షరాలు పట్టేలా ఉండాలి
 8. ఒక్కో బాక్స్ కు విడిగానూ, కొన్ని బాక్సులకు మాత్రమే ప్రత్యేకంగానూ, మొత్తం అన్ని బాక్సులకూ అందేలా రకరకాలుగా మెసేజ్ పంపుకునే సౌకర్యం ఉండాలి.
 9. బలవంతంగా మెసేజ్ పంపుకునే సౌకర్యం కూడా ఆ సెట్ టాప్ బాక్స్ లో ఉండాలి.
 10. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రమాణాలకు తగినట్టుగా ఉండాలి. ( శాటిలైట్ బాక్స్ లకు BIS నిర్దిష్టమైన కొలతలు చెప్పిందే తప్ప కేబుల్ బాక్సులకు లేవు. )
  బి. ఫింగర్ ప్రింటింగ్ అవసరాలు
 11. రిమోట్ మీద ఏ మీట నొక్కినా ఫింగర్ ప్రింటింగ్ పోకూడదు.
 12. వీడియో లో అన్నిటికంటే పైన ఉన్న లేయర్ మీద ఫింగర్ ప్రింటింగ్ ఉండాలి.
 13. ఫింగర్ ప్రింటింగ్ ఎలా ఉండాలంటే అది ఆ నిర్దిష్టమైన సెట్ టాప్ బాక్స్ ని లేదా వ్యూయింగ్ కార్డ్ ని గుర్తించగలగాలి.
 14. సెట్ టాప్ బాక్స్ లో అన్ని స్క్రీన్ల మీద ఫింగర్ ప్రింటింగ్ కనబడేట్టు ఉండాలి. అంటే, మెను లేదా ఇపిజి ( ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్ ) లాంటి వాటిమీద
 15. ఫింగర్ ప్రింటింగ్ ప్రదేశాన్ని హెడ్ ఎండ్ నుంచి మార్చుకునే సౌకర్యం ఉండాలి. యాదృచ్ఛికంగా అది టీవీ తెరమీద కనబడాలి.
 16. ఫలానా సెట్ టాప్ బాక్స్ ని , వ్యూయింగ్ కార్డ్ ని గుర్తుపట్టగలిగేలా ఫింగర్ ప్రింటింగ్ ఉండాలి.
 17. ఫింగర్ ప్రింటింగ్ అనేది సార్వజనీనంగానూ, ఒకే ఒక బాక్స్ మీద కూడా వీలయ్యేట్టు ఉండాలి. అయితే, ఒక్కో బాక్సుకూ చేసుకుంటూ అన్ని బాక్సులమీదా ప్రయోగించాలంటే మాత్రం చాలా ఎక్కువ బాండ్ విడ్త్ అవసరమవుతుంది. అలాంటప్పుడు ఆథరైజేషన్, డీ ఆథరైజేషన్ లాంటి పనులు బాగా నిదానిస్తాయి.
 18. చానల్ నిర్వాహకుల నుంచి వచ్చే బహిరంగంగా కనబడే ఫింగర్ ప్రింటింగ్ లేదా తెరమీద కనబడే మెసేజ్ ల విషయంలో ఎమ్మెస్వోగాని, స్థానిక ఆపరేటర్ గాని వాటి ప్రదేశం, సమయం, వ్యవధి లాంటివి ఎలాంటి మార్పులూ చేయకూడదు.
 19. ఎలాంటి ఉమ్మడి ఇంటర్ ఫేస్ ఉండే పరికరాలనూ చందాదారుడి ఆవరణలో ఉపయోగించకూడదు.
  ఫింగర్ ప్రింటింగ్ అనేది తెరమీద కనిపిస్తుంది. ఎలాంటి మార్పులూ, చేర్పులకూ, తప్పుడు విధానాలకూ పాల్పడే అవకాశం లేని విధంగా ఫింగర్ ప్రింటింగ్ ఫీచర్ ని రూపొందించటం సెట్ టాప్ బాక్స్ తయారీదారుడి బాధ్యత. కొంతమంది ఆపరేటర్లు తమకు అనుకూలంగా బాక్సులను మార్చుకోవటం, తెరమీద డిస్ ప్లే కనబడకుండా చేయటం లాంటి చర్యలకు పాల్పడినట్టు ఫిర్యాదులున్నాయి.
  సి. కాస్, ఎస్ ఎమ్ ఎస్ అవసరాలు
 20. ఇప్పుడు అందుబాటులో ఉన్న కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ వెర్షన్ కి గతంలో హాకింగ్ గురైన చరిత్ర ఉండి ఉండకూడదు.
 21. ప్రపంచంలో మరే పరికరం గాని సాఫ్ట్ వేర్ గాని దీన్ని హాకింగ్ చేయటమో, ఫింగర్ ప్రింటింగ్ ని నిర్వీర్యం చేయటమో సాధ్యం కాని విధంగా ఉండాలి. ముందే చెప్పినట్టు ఫింగర్ ప్రింటింగ్ అనేది సెట్ టాప్ బాక్స్ లో ఒక ఫీచర్. దీన్ని ఏ విధంగానూ CAS తో గాని, SMS తో గాని పరస్పరం అనుసంధానం చేయకూడదు.
 22. భద్రత కోసం సెట్ టాప్ బాక్స్ ను, వ్యూయింగ్ కార్డ్ ను హెడ్ ఎండ్ నుంచే జతచేయాలి
 23. కాస్ ను, ఎస్ ఎమ్ ఎస్ ను సమీకృతం ( ఇంటిగ్రేట్ ) చేయాలి. అవసరమైనప్పుడు రెండు వ్యవస్థల ద్వారా ఒకేసారి యాక్టివేషన్, డీయాక్టివేషన్ చేయాలి
 24. ఎప్పుడినా హాకింగ్ జరిగినట్టు తేలితే కండిషనల్ యాక్సెస్ కంపెనీ తన కండిషనల్ యాక్సెస్ ని అప్ గ్రేడ్ చేయగలిగే సామర్థ్యం ఉన్నదై ఉండాలి.
 25. ఎస్ ఎమ్ ఎస్, కాస్ విడివిడిగా చందాదారులకు చానళ్ల వారీగా, సెట్ టాప్ బాక్సుల వారీగా సమాచారం ఇవ్వగలిగేవి అయి ఉండాలి.
 26. ఎన్ క్రిప్షన్ ప్రక్రియను, నిల్వచేసుకునే విధానాన్ని, వాడకందారులు దానిలో జోక్యం చేసుకునే వీల్లేకుండా, మార్పులు చేయకుండా ఎలా సాధ్యమవుతుందో కండిషనల్ యాక్సెస్ కంపెనీ స్పష్టంగా వివరించాలి. ( కానీ ఇది భద్రతాపరమైన గట్టి వ్యవస్థకు వ్యతిరేకం. అలా వివరించటమంటే దొంగకే తాళాలు ఇచ్చినట్టవుతుంది )
 27. డీక్రిప్షన్, డీకంప్రెషన్ ల మధ్య కంటెంట్ ను భద్రంగా ఉంచటానికి ఒక వ్యవస్థ ఉండితీరాలి. ఇది సెట్ టాప్ బాక్స్ అమ్మకం దారులే ఏర్పాటుచేసే లక్షణం అయి ఉండాలి. )
 28. ఎస్ ఎమ్ ఎస్ వ్యవస్థను కంప్యూటరైజ్ చెయ్యాలి. అది చందాదారులకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని రికార్డ్ చేయగలిగేలా ఉండాలి. ఆ సమాచారంలో ఈ దిగువ పేర్కొన్న అంశాలు ఉంటాయి:
 • చందాదారునికి కేటాయించే ప్రత్యేకమైన నెంబర్
 • చందాదారు పేరు
 • కనెక్షన్ ఏర్పాటుచేసిన అడ్రస్
 • మొబైల్ నెంబర్
 • ఈ-మెయిల్ ఐడి
  *సెట్ టాప్ బాక్స్ కి కేటాయించిన ప్రత్యేకమైన నెంబర్
  *చందాదారు కాంటాక్ట్ నెంబర్
  *బిల్లింగ్ అడ్రస్
  *లాండ్ లైన్ నెంబర్
  *అడ్రస్ కి కొండగుర్తు
  *చందా కట్టిన సర్వీసు లేదా పాకేజ్
 • వ్యూయింగ్ కార్డ్ కి ప్రత్యేకంగా కేటాయించిన నెంబర్
 1. ఒటిఎ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ చేయటానికి వీలుకల్పిస్తూ బాక్సులను వైర్ లెస్ విధానంలోనూ సంప్రదించగలిగే ఏర్పాటు ఉండాలి.
 2. ఎస్ ఎమ్ ఎస్ ఈ దిగువ పనులు చేపట్టగలగాలి:

ఎ. యాక్టివేషన్ , డీయాక్టివేషన్ గతంలో ఎప్పుడెప్పుడు జరిగాయో పాత వివరాలన్నీచూడటానికి, ప్రింట్ చేసుకోవటానికీ అవకాశముండాలి.
బి. ప్రతి ఒక్క సెట్ టాప్ బాక్స్ వ్యూయింగ్ కార్డ్ ఉన్న ప్రదేశం
సి. ఎప్పుడంటే అప్పుడు ఎస్ ఎమ్ ఎస్ ఈ దిగువ సమాచారం ఇవ్వగలగాలి

 1. అధికారపూర్వకంగా ఉన్న మొత్తం చందాదారుల సంఖ్య
 2. నెట్ వర్క్ లో ఇప్పటివరకు ఉన్న మొత్తం చందాదారులు ( ఎస్ ఎమ్ ఎస్ ఒక్కో సర్వీసుకూ అధికారపూర్వకమైన చందాదారులు ఈ నెలకు, లేదా గత నెలలకూ ఎంతమంది ఉన్నదీ ఎస్ ఎమ్ ఎస్ ఇవ్వగలుగుతుంది)
  • ఒక నిర్దిష్టమైన తేదీలో ఒక నిర్దిష్టమైన సర్వీస్ చూస్తున్న చందాదారుల మొత్తం సంఖ్య ( అది టూ వే నెట్ వర్క్ అయి ఉండి చందాదారులందరూ ప్రతిరోజూ అన్ని చానల్స్ లోనూ ఇంటరాక్టివ్ సర్వీసులు వాడుకుంటున్న పక్షంలో ఇది సాధ్యమే )
 3. విడివిడిగా చందాదారుడు కోరుకున్న చానల్స్ వివరాలు
 4. పాకేజ్ లున్న చానళ్ళ పాకేజీల వారీ వివరాలు
 5. పాకేజీల వారీగా చందాదారుల సంఖ్య
  • ఆయా నిర్దిష్టమైన చానల్ పాకేజీలలో చందాదారు సీనియారిటీ
  • పైన పేర్కొన్న మొత్తం సమాచారం గత చరిత్ర కనీసం రెండేళ్ళపాటు ఉండాలి
 6. ఏకకాలంలో ఎస్ ఎమ్ ఎస్, కాస్ …. రెండూ కనీసం పదిలక్షలమంది చందాదారులను నిర్వహించగలిగే సామర్థ్యం కలిగినవై ఉండాలి
 7. ఎస్ ఎమ్ ఎస్, కాస్ రెండూ పేరుమోసిన కంపెనీలవి అయి ఉండాలి. కనీసం పది లక్షల చందాదారులకు ఏవైనా ఇతర పే టీవీ చానల్స్ కోసం వాడకంలో ఉన్నవై ఉండాలి. ప్రపంచంలో ఎక్కడైనా పది లక్షలకు మించి చందాదారులున్న ఏదైనా నెట్ వర్క్ లో కనీసం ఏడాది పాటు వాడకంలో ఉన్నవై ఉండాలి.
 8. కాస్ వ్యవస్థ సమకూర్చే సంస్థ ప్రతినెలా ఒక నిర్దిష్టమైన చానల్ లేదా నిర్దిష్టమైన పాకేజ్ యాక్టివేషన్ల జాబితా ఇవ్వగలిగేట్టు ఉండాలి
 9. కంటెంట్ ధర, ఎక్విప్ మెంట్ రెంటల్, పన్నులు లాంటి అంశాలవారీగా బిల్లులు తయారుచేయగలిగేలాఎస్ ఎమ్ ఎస్ వ్యవస్థ ఉండాలి
 10. భారతదేశంలో రేయింబవళ్ళూ, ఏడాది పొడవునా వ్యవస్థను నిర్వహించగలిగేలా ఎస్ ఎమ్ ఎస్, కాస్ సరఫరా సంస్థలకు తగినంత సాంకేతిక సామర్థ్యం ఉండాలి
 11. కాస్, ఎస్ ఎమ్ ఎస్, సెట్ టాప్ బాక్స్ లు అమ్మే సంస్థలు గడిచిన మూడేళ్ళలో ఆర్థికంగా లాభదాయకమైన స్థితిలో ఉన్నవారై ఉండాలి. ఈ వ్యవస్థలను మెరుగుపరచటానికి, అప్ గ్రేడ్ చేయటానికి తగిన వనరులు ఉన్నవారేనని నిరూపించుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here