కొత్త టారిఫ్ ఆర్డర్ మీద తీర్పు కోసం ట్రాయ్ వినతి

0
751

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) రెండో టారిఫ్ ఆర్డర్ జారీచేసి ఏడాది దాటినా అది ఇంకా కొలిక్కి రాలేదు. దీనిమీద బ్రాడ్ కాస్టర్లు వేసిన కేసు విచారణ పూర్తయినా ఇంకా తుది తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా తీర్పు ఇవ్వాలని కోరుతూ ట్రాయ్ బొంబాయ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అమలు చేస్తే కోర్టు ధిక్కారం అవుతుంది గనుక త్వరగా తీర్పు ఇవ్వాలని ట్రాయ్ ఆ లేఖలో కోరింది. ఈ నెలాఖరు లోపలే ఈ కేసును లిస్ట్ చేయటం ద్వారా త్వరగా తీర్పు వెలువరించాలని విజ్ఞప్తి చేసింది. త్వరగా తీర్పు రావాల్సిన అవసరాన్ని కూడా ఆ లేఖలో పేర్కొంది.
ట్రాయ్ కొత్త చైర్మన్ పిడి వాఘేలా ఈ విధంగా లేక రాయటం ద్వారా ఎన్టీవో 2.0 ను వీలైనంత త్వరగా అమలు చేయటానికి ట్రాయ్ కట్టుబడి ఉందన్న వాస్తవాన్ని చాటినట్టయిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ప్రజలకు మేలు చేసే విషయం గనుక ట్రాయ్ పట్టుబడుతున్నట్టు కూడా స్పష్టమవుతోంది. చందాదారులకు మెరుగైన ధరలో ఎక్కువ చానల్స్ ఎంచుకునే సౌకర్యం కలగటమే రెండో టారిఫ్ ఆర్డర్ లక్ష్యం. ఇంక ఏ మాత్రమూ ఆలస్యం చేయకుండా బ్రాడ్ కాస్టర్లు లిటిగేషన్ల జోలికి వెళ్ళకుండా ఒప్పుకుంటే పరిశ్రమ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
2020 జనవరి 1 న ట్రాయ్ రెండో టారిఫ్ ఆర్డర్ ( ఎన్టీవీ 2.0) జారీచేసినప్పుడు బ్రాడ్ కాస్టర్లు షాక్ తిన్నారు. కనీవినీ ఎర్రుగని ఈ నిర్ణయంతో ప్రధాన్ బ్రాడ్ కాస్టర్లు కోర్టుకు వెళ్ళటానికే నిర్ణయించుకున్నారు. నిజానికి పంపిణీ రంగానికి కూడా ఇబ్బంది కలిగిమ్చే అంశాలు అందులో ఉన్నా పంపిణీ సంస్థలు కోర్టుకు వెళ్ళకుండా, కేవలం నిరసన తెలియజేయటానికే పరిమితమయ్యాయి. నిరుడు ఫిబ్రవరి చివరి నుంచి మార్చి మొదటి సగం దాకా వేగంగా విచారణ సాగింది. ఆ తరువాత మళ్ళీ సెప్టెంబర్-అక్టోబర్ లో కూడా వాదనలు సాగాయి. వాదనలు పూర్తయ్యాక తీర్పు మాత్రం వాయిదా పడింది.
ఈ తాజా ప్రతిపాదనల వలన చందాదారులకు ఎంతో మేలు జరుగుతుందని ట్రాయ్ వాదించింది. అయితే, ట్రాయ్ మితిమీరి జోక్యం చేసుకుంటున్నదని బ్రాడ్ కాస్టర్లు వాదించారు. ముఖ్యంగా ధర నిర్ణయాధికారం తమకే ఉందాలని, ట్రాయ్ జోక్యం వలన పరిశ్రమకు స్థిరత్వం ఉండదని వాదించారు. నిజానికి కరోనా సంక్షోభ సమయంలోనే అమలు చేయటానికి ట్రాయ్ ప్రయత్నించినా, సంయమనం పాటించాలని కోర్టు సూచించటంతో ఆగాల్సి వచ్చింది.
పంపిణీ సంస్థలు మాత్రం అదే నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద 200 చానల్స్ ఇవ్వాలన్న నిబంధనను, అవి కాక దూరదర్శన్ చానల్స్ 26 ఇవ్వాలన్న నిబంధనను అమలు చేయటానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో ఒక ఇంట్లో రెండో కనెక్షన్ ను కేవలం 40% నెట్ వర్క్ కెపాసిటీ ఫీజుతో ఇవ్వాలన్న నిబంధనను కూడా నిరసనతోనే ఒప్పుకున్నారు. ఇలాంటి రాయితీని పే బ్రాడ్ కాస్టర్ల చేత రెండో కనెక్షన్ కు ఇప్పించకపోవటం సహజంగానే కేబుల్ రంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది.
ట్రాయ్ సిఫార్సులకు అనుకూలంగా తీర్పు వచ్చే పక్షంలో బొకేలో ఉంచే పే చానల్స్ ధరలు తగ్గటం ద్వారా కేబుల్ టీవీ చందాదారుల బిల్లు సగటున 50 రూపాయలదాకా తగ్గే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here