టీవీ సిబ్బందికి కోవిడ్ పరీక్షలు జరపండి

0
615

మహారాష్ట్రలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపించకపోవటంతో అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో భారత చలన చిత్ర, టీవీ నిర్మాతల మండలి ( ఐ ఎఫ్ టి పి సి) టీవీ నిర్మాతలందరూ తమ సిబ్బందికి కోవిడ్ పరీక్షలు జరిపిఒంచాలని సూచించింది. ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్ట్లలో పనిచేసేవా ఆర్ టి –పిసిఆర్ /యాంటిజెన్ పరీక్షలు జరిపించాలని కోరింది. కనీసం రెండు వారాల పాటు పూర్తి లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో మందలి స్వీయ నియంత్రణలో భాగంగా ఈ చర్యకు పూనుకుంది.
మహారాష్ట్రలో ముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సగటున రోజుకు 60 వేలవరకు కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే 394 మంది కోవిడ్ కి బలయ్యారు. దీంతో మహారాష్టలో ఇప్పటిదాకా 57,987 మంది కోవిడ్ తో చనిపోయినట్టయింది. ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ తోబాటు వారాంతపు లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు అన్ని సినిమా హాళ్ళు, మల్టిప్లెక్స్ లు కూడా ఏప్రిల్ 30 వరకు మూసివేసిఒన విషయాన్ని భారత చలన చిత్ర, టీవీ నిర్మాతల మండలి ఈ సందర్భంగా ప్రస్తావించింది.
అయితే షూటింగ్స్ మాత్రం కొన్ని నిబంధనలకు లోబడి కొనసాగేందుకు అనుమతించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని మండలి ఈ ప్రకటనలో పిలుపునిచ్చింది. ప్రస్తుతం దాదాపు 90 కార్యక్రమాల షూటింగ్స్ జరుగుతూ ఉండటాన్ని ప్రస్తావిస్తూ, అందులో పనిచేసే సిబ్బంది మొత్తానికీ కోవిడ్ పరీక్షలు జరిపించాలని నిర్మాతలను కోరింది. ఇప్పటికే 9000 పరీక్షలు జరిపినట్టు సమాచారం ఉందని, మరింత కట్టుదిట్టంగా వ్యవహరించేందుకు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకొకసారి పరీక్షలు జరిపించాలని సూచించింది.
ఈ పరీక్షల ఖర్చులను చానల్ యాజమాన్యాలే భరించాలని మండలి చైర్మన్ మజీతియా సూచించారు. షూటింగ్ జరిగే ప్రదేశాలను పూర్తిగా శానిటైజ్ చేయించాల్సిందిగా నిర్మాతలను కోరామన్నారు. ప్రజలు ఇళ్ళలోనే ఉండిపోయేలా, వత్తిడి నుంచి విముక్తి పొందేలా చేయటానికి వీలుగా అనేక కార్యక్రమాలను టీవీ రంగం నిర్మిస్తున్నదని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం కూడా ఈ పరిశ్రమను నిత్యావసర సేవారంగంగా గుర్తించాలని, ఈ సిబ్బందిని కోవిడ్ యోధులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
ఆదివారం (11న) నాడు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ తో సమావేశమై ప్రస్తుత పరిస్థితిని సమీక్షించటంతోబాటు లక్ డౌన్ విధిస్తే ఎదురయ్యే పర్యవసానాలను కూడా చర్చించారు. పరిస్థితిలో మార్పు లేకపోతే లాక్ దౌన్ అనివార్యమని కూడా సూచనప్రాయంగా హెచ్చరించారు. 14 తరువాత నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే, లాక్ డౌన్ విధించే పక్షంలో సినీ, టీవీ రంగానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదముందని పరిశ్రమ వర్గాలు అనుమానిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here