ఎమ్మెస్వో డిజిటల్ హెడ్ ఎండ్ నిర్వహణ (షెడ్యూల్ 3)

0
632

టారిఫ్ ఆర్డర్ లో కేవలం ఆర్థిక పరమైన అంశాలకే ప్రాధాన్యం ఉందనుకుంటే పొరపాటే. అడ్రెసిబుల్ సిస్టమ్ కు ఉండాల్సిన అర్హతలేమిటో ఇది చర్చిస్తుంది. అదేవిధంగా అమలు చేయటంలో పాటించాల్సిన నియమాలు, సాంకేతిక వ్యవహారాలు, పాటించాల్సిన ప్రమాణాలు ఇందులో స్పష్టంగా నిర్దేశించారు. సెట్ టాప్ బాక్స్, కండిషనల్ యాక్సెస్ సిస్టమ్, సబ్ స్క్రైబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఎలాంటి నియమనిబంధనలకు లోబడి ఉండాలో, టారిఫ్ ఆర్డర్ లోని 3వ షెడ్యూల్ నిర్దేశించింది. ఆ అంశాలు ఇక్కడ తెలుసుకుందాం.
అడ్రెసిబుల్ సిస్టమ్ లో మూడు కీలకమైన అంశాలుంటాయి. కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ( కాస్ ) ద్వారా కోరుకున్న చానల్స్ మాత్రమే ఆ చందాదారుకు చేరే అవకాశం ఉంటుంది. సబ్ స్క్రయిబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (ఎస్ ఎమ్ ఎస్ ) ద్వారా చందాదారు వివరాల నిర్వహణ జరుగుతుంది. ఫింగర్ ప్రింటింగ్ వ్యవస్థ మరో అంశమైతే వీటన్నిటికీ తగినట్టుగా సెట్ టాప్ బాక్స్ ఉండటం ఇంకొక ప్రధానమైన అంశం.
ఎ) కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ( కాస్), సబ్ స్క్రయిబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ( ఎస్ ఎం ఎస్ )

  1. చానల్స్ పంపిణీదారుడైన ఎమ్మెస్వో లేదా డిటిహెచ్ / హిట్స్ / ఐపిటీవీ ఆపరేటర్ వాడుతున్న కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ (కాస్) కు గతంలో ఎప్పుడూ హాకింగ్ కు గురైన చరిత్ర ఉండకూడదు. అంటే, కాస్ ఏ కంపెనీది వాడుతున్నామన్నది కూడా చాలా ముఖ్యం. అందువల్ల అది అమ్మే కంపెనీ తమ కాస్ ఎప్పుడూ హాకింగ్ కి గురి కాలేదని హామీ పత్రం ఇవ్వాలి. అప్పుడే ఎమ్మెస్వో ఆ కాస్ తీసుకోవాలి.
  2. సబ్ స్క్రయిబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ( ఎస్ ఎమెస్ ) లో యాక్టివేషన్, డీ యాక్టివేషన్ సహా ఒక్కో సెట్ టాప్ బాక్స్ కీ పంపిన సూచనలు, ఇతర సమాచారం, చందా వివరాల లాంటివి గ్రహించి దాన్ని సందేశం రూపంలో పంపాల్సిన సెట్ టాప్ బాక్స్ కి పంపటంతోబాటు అందులో కనీసం రెండేళ్ళ పాటు రికార్డు చేసుకోలిగే సామర్థ్యం ఉండాలి.
  3. కాస్ లో గాని, ఎస్ ఎమ్ ఎస్ లో గాని రికార్డ్ చేసిన సమాచారం ఏదీ ఆ తరువాత మార్చటానికి వీలుండకూడదు.
  4. పంపిణీ దారుడు (ఎమ్మెస్వో) తన కాస్ బాగానే పనిచేస్తున్నట్టు నిర్థారించుకోవాలి. కాస్ నుంచి వచ్చే సమాచారంతోనే సెట్ టాప్ బాక్స్ పనిచేయాలి. కాస్ నుంచి వచ్చిన ఎస్ ఎమ్ ఎస్ ఆదేశాలతోనే సెట్ టాప్ బాక్స్ యాక్టివేషన్ లేదా డీయాక్టివేషన్ జరగాలి తప్ప మరేవిధమైన అవకాశమూ ఉండకూడదు.
  5. ఎస్ ఎమ్ ఎస్ కాస్ రెండూ ఎంతగా కలిసి పోవాలంటే, ఒక సెట్ టాప్ బాక్స్ ను డీ యాక్టివేట్ చెయ్యాలంటే ఒకేసారి రెండు సిస్టమ్స్ లోనూ అది జరగాలి. దీనర్థం ఏంటంటే ఒక సెట్ టాప్ బాక్స్ ను యాక్టివేట్ చేసినా, డీయాక్టివేట్ చేసినా ఆ విషయం కాస్ లోనూ ఎస్ ఎమ్ ఎస్ లోనూ నమోదై వాటి రిపోర్ట్స్ లో కనబడాలి.
  6. కాస్ సామర్థ్యం ఎలా ఉండాలంటే డిజిటల్ హెడ్ ఎండ్ నుంచే సెట్ టాప్ బాక్స్ ను అప్ గ్రేడ్ చెయ్యగలగాలి. కాస్ అలా పనిచేయగలిగేలా చూసుకునే బాధ్యత ఎమ్మెస్వోదే.
  7. ఏదైనా పరికరం గాని సాఫ్ట్ వేర్ గాని ఉపయోగించి ఫింగర్ ప్రింటింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే అవకాశం ఇవ్వకూడదు.
  8. కాస్, ఎస్ ఎమ్ ఎస్ ఎలా ఉండాలంటే ఆ ఎమ్మెస్వో నెట్ వర్క్ లోని కనెక్షన్లలో కనీసం 10 శాతం సెట్ టాప్ బాక్సులను 24 గంటలలోపే యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేయగలగాలి.
  9. చానల్ సెక్యూరిటీ కాపడటానికి వీలుగా సెట్ టాప్ బాక్సును, వ్యూయింగ్ కార్డ్ ( విసి) ని ఎస్ ఎమ్ ఎస్ నుంచి జతపరచాలి.
  10. కాస్ గానీ ఎస్ ఎమ్ ఎస్ గానీ వ్యక్తిగతంగా ఒక్కో చందాదారుకూ ఏదైనా సమాచారం పంపించగలగాలి. ఒక చానల్ గురించి గాని, వాళ్ళ బిల్లు సమాచారం గాని సెట్ టాప్ బాక్సుల వారీగా పంపే వీలుండాలి.
    11.ఎస్ ఎమ్ ఎస్ ను కంప్యూటరైజ్ చేయటం ద్వారా కీలక సమాచారాన్ని రికార్డు చేయగలగాలి. చందాదారుకు సంబంధించిన ఈ దిగువ సమాచారం అందులో పొందుపరచగలగాలి.
    i. విశిష్టమైన చందాదారు గుర్తింపు సంఖ్య ( ఐడి)
    ii. చందా సంప్రదింపు సంఖ్య
    iii. చందాదారు పేరు
    iv. బిల్లింగ్ చిరునామా
    v. కనెక్షన్ ఉన్న చిరునామా
    vi. లాండ్ లైన్ ఫోన్ నెంబర్
    vii. మొబైల్ ఫోన్ నెంబర్
    viii. ఈ –మెయిల్ అడ్రెస్
    ix. చందా కట్టిన చానల్స్, బొకేలు, సేవలు
    x. విశిష్ట సెట్ టాప్ బాక్స్ నెంబర్
    xi. విశిష్ట వ్యూయింగ్ కార్డ్ (విసి) నెంబర్
  11. ఎస్ ఎమ్ ఎస్ ఈ కింది అంశాలలో సామర్థ్యం కలిగినదై ఉండాలి
    i. సెట్ టాప్ బాక్సుల యాక్టివేషన్ , డీయాక్టివేషన్ కు సంబంధించిన పూర్వ చరిత్రను చూడగలగటం, ముద్రించగలగటం
    ii. అమర్చిన ప్రతి సెట్ టాప్ బాక్సును, వ్యూయింగ్ కార్డునూ ఎక్కడున్నదీ గుర్తించటం
    iii. ప్రతి చందారుడూ తన చందాలో చేసుకున్న మార్పుల పూర్వ చరిత్ర, అందుకు సంబంధించి అతడు చేసుకున్న వినతినీ గుర్తించి అందజేయగలగటం.
  12. ఏ సమయానికి సమాచారం కావాలన్నా ఎస్ ఎమ్ ఎస్ ఈ రిపోర్టులు అందించగలగాలి.
    i.రిజిస్టర్ చేసుకున్న చందాదారుల సంఖ్య
    ii.మొత్తం వాడకంలో ఉన్న చందాదారుల సంఖ్య
    iii. తాత్కాలికంగా సస్పెండ్ అయిన చందాదారుల సంఖ్య
    iv. మొత్తం డీయాక్టివేట్ చేసుకున్న చందాదారులు
    v. మొత్తం బ్లాక్ లిస్ట్ చేసిన సెట్ టాప్ బాక్సులు
    vi. నిర్ణీత నమూనాలో చానల్స్, బొకేల వారీగా నెలవారీ చందా వివరాలు
    vii. ఒక్కో బొకేలో భాగంగా ఉన్న చానల్స్ పేర్లు
    viii. ఏ నిర్ణీత సమయంలోనైనా ఒక నిర్దిష్టమైన చానల్ కు లేదా బొకేకి చందా కడుతున్న వాడకంలోని చందాదారుల మొత్తం సంఖ్య
    ix. ఒక చందాదారుడు కోరుకున్న అలా కార్టే, బొకే చానల్స్ పేర్లు
    x. ఒక చానల్ లేదా బొకేకి ఎంతకాలంగా చందా కడుతున్నదీ చరిత్ర చెప్పే రిపోర్ట్
  13. కాస్ స్వతంత్రంగా కనీసం గడిచిన రెండేళ్ళ వివరాలను రూపొందించటం, నమోదు చేయగలగటం, లాగ్ నిర్వహించటం చేయగలిగి ఉండాలి. యాక్టివేషన్, డీయాక్టివేషన్ సహా కాస్ లో చేసిన ప్రతి చిన్న సవరణ లేదా ఎంట్రీకి సంబంధించిన వివరాలన్నీ అందులో భాగంగా ఉండాలి.
  14. పైరసీకి పాల్పడినట్టు తేలిన ప్రతి వ్యూయింగ్ కార్డునూ, ప్రతి సెట్ టాప్ బాక్సునూ టాగ్ చేసి బ్లాక్ లిస్ట్ చేయగలిగిన సామర్థ్యం కాస్ కు ఉండాలి. అలాంటివి మళ్ళీ ఇంకొక చోట వాడే వీలుండకూడదు.
  15. కాస్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ దిగువ రిపోర్టులు అందించగలగాలి.
    i. సెట్ టాప్ బాక్సునూ, వ్యూయింగ్ కార్డునూ జతచేయటం, విడగొట్టటం
    ii. సెట్ టాప్ బాక్స్ యాక్టివేషన్, డీయాక్టివేషన్
    iii. సెట్ టాప్ బాక్సులు చానల్ కేటాయింపు
    iv.ఏదైనా ఒక చానల్ ను నిర్దిష్టకాలంపాటు యాక్టివేట్, లేదా డీయాక్టివేట్ చేయటం
  16. ప్రతి చందాదారుకూ అంశాల వారీగా బిల్లు తయారుచేసి ఏ చానల్స్ కు చందా కట్టాడు, సెట్ టాప్ బాక్స్ అద్దెకు ఇచ్చి ఉంటే అద్దె ఎంత, ఎంచుకున్న చానల్స్ కు నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు (బేసిక్ పాక్ ధర), పే చానల్స్ కు కట్టాల్సిన చందా, బొకేలకు కట్టే మొత్తం ఆయా చానల్స్ చిల్లర ధరలు, బొకే ధరలు, పన్నుల వివరాలతో సహా ఇవ్వగలిగే సామర్థ్యం ఎస్ ఎమ్ ఎస్ కు ఉండాలి.
  17. ఎమ్మెస్వో తాను కాస్, ఎస్ ఎమ్ ఎస్ ను ఎంచుకునేటప్పుడు వాటి అమ్మకందారుడు వాటిని ఏడాదిపొడవునా, రేయింబవళ్ళూ భారతదేశంలో నిర్వహించగలిగే సామర్థ్యం ఉన్నవాడేనని నిర్థారించుకోవాలి
  18. ఎమ్మెస్వో తాను వినియోగించుకుంటున్న ఎస్ ఎమ్ ఎస్, కాస్ వివరాలు వెల్లడించాలి. ఒకవేళ అదనంగా మరేదైనా కాస్ లేదా ఎస్ ఎమ్ ఎస్ వాడుకుంటున్న పక్షలో ఆ సమాచారాన్ని బ్రాడ్ కాస్టర్ కు తెలియజేతాలి
  19. ఎస్ ఎమ్ ఎస్ నుంచి ఎవరైనా చందాదారును డీయాక్టివేట్ చేసిన మీదట ఆ చందారుకు అన్ని సేవలూ, కార్యక్రమాలూ నిలిచిపోవాలి
  20. టీవీ చానల్స్ పంపిణీదారుడు ( ఎమ్మెస్వో) ఎలాంటి మార్పులూ చేర్పులూ చేయని కాస్ డేటా ను కనీసం రెండేళ్ళ పాటు నిల్వ ఉంచాలి.
    బి. ఫింగర్ ప్రింటింగ్
  21. క్రమం తప్పకుండా ప్రింగర్ ప్రింటింగ్ వ్య్వస్థలో తగిన విధానాలూ, కంట్రోల్స్ పనిచేస్తున్నాయని ఎమ్మెస్వో నిర్థారించుకోవాలి
  22. ప్రత్యక్షంగా కనబడే ఫింగర్ ప్రింటింగ్, రహస్యంగా నిర్వహించే ఫింగర్ ప్రింటింగ్ కు కూడా సెట్ టాప్ బాక్స్ అనుకూలంగా ఉండాలి
  23. సెట్ టాప్ బాక్స్ రిమోట్ కంట్రోల్ మీద ఏదైనా కీ వత్తటం ద్వారా ఆ ఫింగర్ ప్రింటింగ్ పోయేలా ఉండకూడదు
  24. ఫింగర్ ప్రింటింగ్ అనేది వీడియో మీద అన్నిటికంటే పైన ఉండే పొర మీద పడాలి
  25. ఆ ఫింగర్ ప్రింటింగ్ సాయంతో ఆ సెట్ టాప్ బాక్స్ నెంబర్ ను, విశిష్టమైన వ్యూయింగ్ కార్డ్ నెంబర్ ను గుర్తించగలగాలి
  26. ఈ ఫింగర్ ప్రింటింగ్ అన్ని సందర్భాలలోనూ కనబడాలి. అంటే మెనూ నొక్కినా, ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్ ఉన్నా, సెట్టింగ్స్ లోకి వెళ్ళినా, ఖాళీ స్క్రీన్ ఉన్నా, గేమ్స్ నడుస్తున్నా కనబడాలి
  27. హెడ్ నుంచి లొకేషన్, ఫాంట్ రంగు, బాక్ గ్రౌండ్ కలర్ మార్చుకోగలిగే వెసులుబాటు ఉండాలి. అది ప్రేక్షకుడి తెరమీద కనబడాలి
  28. సెట్ టాప్ బాక్సునూ, దాని వ్యూయింగ్ కార్డునూ గుర్తించగలిగేలా ఫింగర్ ప్రింటింగ్ ఎన్ని కారెక్టర్స్ ఉన్నదీ ఆ సంఖ్య ఇవ్వగలగాలి
  29. వ్యక్తిగత సెట్ టాప్ బాక్సుల ప్రాతిపదికన, మొత్తం బాక్సుల ప్రాతిపదికన ఫింగర్ ప్రింటింగ్ సాధ్యం కావాలి.
  30. ప్రత్యక్షంగా కనబడే ఫింగర్ ప్రింటింగ్ విషయంలో పంపిణీదారు (ఎమ్మెస్వో) సమయం, ప్రదేశం, వ్యవధి, ఫ్రీక్వెన్సీ లాంటివి ఏ మార్పూ చేయకుండా చూపించాలి.
  31. స్క్రోల్ రూపంలో ఇచ్చే మెసేజ్ ఏదైనా అది స్క్రీన్ కింది భాగంలో మాత్రమే ఉండాలి
  32. ఫింగర్ ప్రింటింగ్ అనే ఫీచర్ ని ఎప్పటికీ తొలగించటానికి వీల్లేకుండా సెట్ టాప్ బాక్స్ ఉండాలి
  33. అన్ని పే చానల్స్ కూ వాటర్ మార్కింగ్ నెట్ వర్క్ లోగ్ అనేది ఎన్ కోడర్ దగ్గర మాత్రమే జోడిస్తారు
    సి) సెట్ టాప్ బాక్స్ ( ఎస్ టి బి)
  34. అన్ని సెట్ టాప్ బాక్సులకూ కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ఉండాలి
  35. హెడ్ ఎండ్ దగ్గర పెట్టిన కండిషనల్ యాక్సెస్ సందేశాలను డీక్రిప్ట్ చేసుకోగలిగే సామర్థ్యం సెట్ టాప్ బాక్సుకు ఉండాలి.
  36. సెట్ టాప్ బాక్సుకు ఫింగర్ ప్రింటింగ్ చేయగల సామర్థ్యం ఉండాలి. అది ఎంటైటిల్మెంట్ కంట్రోల్ మెసేజ్ (ఇసిఎమ్), ఎంటైటిల్మెంట్ మేనేజ్ మెంట్ మెసేజ్ (ఇఎమ్ ఎమ్) ను సపోర్ట్ చేయగలిగి ఉండాలి.
  37. హెడ్ ఎండ్ నుంచి అడ్రెస్ చేయగలిలే అవకాశం ఉండాలి
  38. హెడ్ ఎండ్ నుంచి వ్యక్తిగతంగా సందేశం అందుకోగలిగే సామర్థ్యం ఉండాలి
  39. మెసేజ్ సామర్థ్యం కనీసం 120 అక్షరాలు ( కారెక్టర్స్) ఉండాలి
  40. అందరికీ కలిపి, ఒక సమూహానికి లేదా వ్యక్తిగతంగా మెసేజ్ పంపటానికి వీలుండాలి
  41. బలవంతంగా మెసేజ్ పంపటానికి, బలవంతంగా ఫింగర్ ప్రింటింగ్ చేయటానికి కూడా సెట్ టాప్ బాక్స్ తగినట్టు ఉండాలి.
  42. భారత ప్రభుత్వం నిర్దేశించిన బ్యూర్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలకు అనుగుణంగా సెట్ టాప్ బాక్స్ ఉండాలి.
  43. ఎలాంటి వైరు సాయం లేకుండానే సెట్ టాప్ బాక్సును సంప్రదించగలిగే అవకాశం ఉండాలి. అదే పద్ధతిలో సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేసే అవకాశం కూడా ఉండాలి.
  44. రికార్డింగ్ సౌకర్యం కూడా ఉన్న సెట్ టాప్ బాక్స్ అయితే దాన్నుంచి కాపీ చేసుకునే అవకాశం లేకుండా రక్షణ ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here