హరే కృష్ణ టీవీలో స్ఫూర్తిదాయక ప్రసంగాలు

0
482

డాక్టర్ బిమల్ షా ఆధ్వర్యంలో కేబుల్ చానల్ గా మొదలై నిరుడు శాటిలైట్ చానల్ గా మారిన హరేకృష్ణ టీవీ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. సామాజిక సేవే లక్ష్యంగా నడుపుతున్న ఈ ఉచిత చానల్ ను అనేకమంది కేబుల్ ఆపరేటర్లు కారేజ్ ఫీజు తీసుకోకుండానే ఇస్తూ రెండున్నర కోట్ల ఇళ్లకు చేర్చటాన్ని ప్రస్తావిస్తూ, మరింత మందికి చేరువయ్యేలా చూడాలని ఎమ్మెస్వోలకు నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. టెలీషాపింగ్ సహా ఎలాంటి ప్రకటనలూ తీసుకోకపొవటమే తమ సేవాదృక్పథానికి నిదర్శనమంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 600 ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షస్ నెస్ ( ఇస్కాన్) కేంద్రాల నుంచి ఈ చానల్ కు కార్యక్రమాలు అందుతూ ఉంటాయి. వివిధ ఇస్కాన్ కేంద్రాలు అందించే ఆలయ దర్శనం, హారతులు ఇందులో ప్రసారమవుతాయి. ఇవే కాకుండా సంగీతం, సత్సంగ్ లాంటి కార్యక్రమాలు కూడా ఇందులో ఉంటాయి.
” మా చానల్ భగవద్గీత లేదా పురాణాల గురించి మాట్లాడదు. యువతను ఆకట్టుకునే స్ఫూర్తిదాయకమైన అనేక ప్రసంగాలను ప్రసారం చేస్తుంది. కేవలం మతానికి పరిమితం కాకుండా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే ఉపన్యాసకులు తమ ప్రసంగాలతో స్ఫూర్తి నింపుతారు” అని డాక్టర్ బిమల్ షా అంటున్నారు. ఈ చానల్ ప్రారంభమై నేటికి నాలుగేళ్ళు నిండింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here