లిక్కర యాడ్స్ కు ఒటిటి వేదికను వాడుకుంటున్న సోనీ

0
529

సోనీ సంస్థ తన ఒటిటి వేదిక సోనీలైవ్ లో బ్రేక్స్ మధ్య లిక్కర్ బ్రాండ్స్ ప్రకటనలు అందిస్తూ సరికొత్త వివాదానికి తెరతీసింది. టీవీలో, పత్రికలలో లిక్కర్ యాడ్స్ వేయకూడదన్న నిబంధన ఉండగా ఎలాంటి అడ్డూ అదుపూ లేని ఒటిటి లో ఈ ప్రకటనలు ప్రసారం చేయటం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఇపటివరకూ ఒటిటి వేదికల సొంత కార్యక్రమాలమీద ఎలాంటి ఆంక్షలూ లేకపోవటం తెలిసిందే.
మింట్ పత్రికలో వెలువడిన వార్త ప్రకారం ఆ లికర్ సంస్థ తన స్కాచ్ బ్రాండ్స్ అయిన బ్లాక్ డాగ్, బ్లాక్ అండ్ వైట్, వాట్ 69 ను ప్రచారం చేసుకోవటానికి సోనీలైవ్ ఒటిటి వేదికను వాడుకుంది. జేబులో పెట్టుకోవటానికి వీలయ్యే హిప్ స్టర్స్ ను నిరుడు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రకటన ద్వారా దానికి ప్రమోట్ చేసుకుంటోంది.
అయితే ఈ ప్రకటనతోబాటు చట్టప్రకారం మద్యం సేవించే వయసువారికి ఈ ప్రకటన అందజేయవద్దన్న హెచ్చరిక ఉంటుంది. క్రికెట్ టోర్నమెంట్ సమయంలో తెరమీద ప్రత్యక్షమయ్యే ఈ ప్రకటన యువతను అన్ని సందర్భాలూ ఈ మద్యంతో వేడుక చేసుకోమని చెబుతుంది. క్రికెట్ ఎక్కువగా చూసేది ఏ వయసు వారో అందరికీ తెలిసిందే.
ప్రకటనలను నియంత్రించే అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) సెక్రటరీ జనరల్ శ్వేత పురందరే ఈ విషయమై స్పందిస్తూ ఈ విషయం తమ పరిధిలోకి రాదన్నారు. ఒటిటి ప్రకటనల వ్యవహారం నేరుగా సంబంధిత నియంత్రణ సంస్థలే చూసుకోవాలన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here