కేబుల్ ఆపరేటర్లతో సోనీ నటీనటుల లైవ్ చిట్ చాట్

0
511

కోవిడ్ ప్రభావం ప్రజల జీవితాలమీద, మరీ ముఖ్యంగా వ్యాపారాల మీద ఎంతో ప్రభావం చూపింది. ఇలాంటి పరిస్థితుల్లో   అత్యవసర సర్వీసులకో కేబుల్ పరిశ్రమ కూడా కీలకంగా మారింది. ప్రజలు ఇళ్ళలో ఉండగలిగేలా చేయటంలో నిర్విరామ ప్రసారాల పాత్ర అందరికీ తెలిసిందే. ఎలాంటి అంతరాయమూ లేకుండా తమ చందాదారులకు  సమాచారం, వినోదం అందించటంలో స్థానిక కేబుల్ ఆపరేటర్లు చేసిన కృషి అంతా ఇంతా కాదు

ఇలాంటి సేవలందించినా పెద్దగా గుర్తింపు పొందని వారి గురించి ప్రజలకు తెలియజెప్పటానికి సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ప్రత్యేకంగా హాపీ హీరో అనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కేబుల్ ఆపరేటర్లను అభినందించటం కోసం ఒక సరికొత్త వర్చువల్ ఈవెంట్ చేపట్టింది. నుక్కడ లైవ్ పేరుతో సోనీ కార్యక్రమాల యాంకర్లు, సీరియల్ నటీనటులతో ప్రత్యక్షప్రసారం నిర్వహించింది. కేబుల్ ఆపరేటర్లు అందులో పాల్గొని వారితో సంభాషించే అవకాశం కల్పించింది.

” మన రోజువారీ జీవితం ఇప్పుడు డిజిటల్ మయం అయింది. మా వ్యాపార భాగస్వాములతో ఎప్పుడూ సంబంధాలు కొనసాగించటానికే మేం కట్టుబడి ఉన్నాం. అందుకే దేశవ్యాప్తంగా మా ఎమ్మెస్వోలతో భాగస్వామ్యం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మహారాష్ట్రలోని ఆపరేటర్ల కోసం ” నుక్కడ్ లైవ్” ఏర్పాటు చేశాం. మా సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ కు చెందిన కళాకారులు ఇందులో పాల్గొనొ ఆపరేటర్లతో సంభాషించారు. ఎలాంటి అంతరాయమూ లేకుండా ప్రజలకు వినోదం అందిస్తూ అభినందనలకు నోచుకోని నిజమిఅన హీరోలుగా గుర్తిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ విజయంతో మరిన్ని రాష్ట్రాలలో ఈ తరహా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం” అని సోనీ సంస్థ మార్కెటింగ్ విభాగం ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ మకరంద్ పాలేకర్ అన్నారు.

40 నిమిషాలపాటు సాగిన ఈ కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్లు అడిగిన అనేక సరదా ప్రశ్నలకు సోనీ నటీనటులు సమాధానాలిచ్చారు. నిజానికి బ్రాడ్ కాస్టర్లు, పంపిణీ సంస్థలలో ముఖ్యమైన కేబుల్ పరిశ్రమ పరస్పరం ఒకరిమీద ఇంకొకరు ఆధారపడినప్పటికీ ఈ విధమైన కార్యక్రమం నిర్వహించటం ఇదే మొదటిసారి. ఈ సంక్షోభ సమయంలో సత్సంబంధాలు కొనసాగించే క్రమంలో సోనీ తీసుకున్న చొరవ మరింతమందికి ఆదర్శంగా మారే అవకాశాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here