ఐపిఎల్ ప్రేక్షకాదరణను విశ్లేషించిన బార్క్

0
505

టెలివిజన్ ప్రేక్షకాదరణను లెక్కించేందుకు టీవీ పరిశ్రమ స్వయంగా ఏర్పాటు చేసుకున్న ఏకైక సంస్థ బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ఐపిఎల్ 2020 ప్రేక్షకాదరణ మీద 27 పేజీల నివేదిక విడుదల చేసింది. నిజానికి బార్క్ ఇలాంటి చొరవ తీసుకోవటం ఇదే మొదటిసారి. ఐపిఎల్ మొదలైన రెండోవారంలోనే పెద్ద ఎత్తున ప్రేక్షకాదరణ పొందటంతో బార్క్ పరిశీలనకు వచ్చిన ప్రత్యేకాంశాలను, ప్రేక్షకుల ధోరణిని ఈ విశ్లేషణలో వివరించింది.

బార్క్ లెక్కల ప్రకారం స్టార్ ఇండియా ప్రేక్షకాదరణ 15% పెరిగింది. మొదటి వారంలో కొన్ని చానల్స్ లో మాత్రమే ప్రసారం జరిగినా, ఒక మాచ్ తక్కువే అయిన ఐలాంటి సానుకూల ఫలితాలు వెల్లడయ్యాయని కూడా బార్క్ గుర్తించింది. ప్రకటనల పెరుగుదల కూడా 2019 లో మొదటి వారంతో పోల్చుకున్నప్పుడు 15% అధికంగా ఉన్నట్టు బార్క్ అధ్యయనం తేల్చింది. మాచ్ ల వారీగా ప్రకటనల పెరుగుదలను నమోదు చేస్తూ నిరుడు ఐపిఎల్ మొదటివారం అంకెలతో పోల్చి చెప్పింది.

బార్క్ విశ్లేషణలో ముఖ్యాంశాలు:
• ఐపిఎల్ ప్రారంభ మాచ్ లో నిరుటి ప్రారంభ మాచ్ తో పోల్చినప్పుడు 21% ఎక్కువ ప్రేక్షకాదరణ ( చానల్స్ సంఖ్య తక్కువ, ఒక మాచ్ తక్కువ అయినప్పటికీ)
• ఐపిఎల్ మొదటి వారంలో 26.9 కోట్లమంది వీక్షించారు. 2019 తో పోల్చినప్పుడు ఒక్కొక్కో మాచ్ కోటీ పది లక్షలమంది ఎక్కువగా చూశారు.
• ప్రతి ముగ్గురు టీవీ ప్రేక్షకులలో ఒకరు ఐపిఎల్ -13 ప్రత్యక్ష ప్రసారం చూశారు.
• 44% ఇళ్లలో ఐపిఎల్-13 ప్రత్యక్ష ప్రసారం చూశారు.
• హెచ్ డి చానల్స్ కు ఎన్నడూ లేనంత అత్యంత ఆదరణ
• ముంబయ్ ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ప్రారంభ మాచ్ 5 కోట్ల 20 లక్షల వీక్షణలు నమోదు చేసుకుంది. ఇది 2019 కంటే 29% ఎక్కువ. వీక్షకుల సంఖ్య విషయానికొస్తే అది 15 కోట్ల 80 లక్షలమందిగా నమోదైంది. ఇది 2019 నాటి వీక్షకుల కంటే 21% ఎక్కువ.
• ప్రకటనల పరిమాణం స్టార్ స్పోర్ట్స్ చానల్స్ మధ్యనే 15% పెరిగింది. ఇందులో స్టార్ స్పోర్ట్స్ 1 బంగ్లా, స్టార్ స్పోర్ట్స్ 2 (హెచ్ డి + ఎస్ డి) లేవు
• ఐపిఎల్ ముందు వారంతో పోల్చుకున్నప్పుడు ఒటిటి వినియోగదారుల సంఖ్య 32% పెరుగుదల నమోదు చేసుకుంది. ప్రధానంగా ఈ పెరుగుదల డిస్నీ+ హాట్ స్టార్ లో నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here