దేశభక్తి చిత్రాలు ఉచితంగా అందిస్తున్న ఎన్ ఎఫ్ డి సి

0
508

సినిమా అభిమానులు ఇప్పుడు ఉచితంగా దేశభక్తి చిత్రాలు చూడవచ్చు. జాతీయ చలనచిత్రాభివృద్ధి మండలి ( ఎన్ ఎఫ్ డి సి) తన దగ్గర ఉన్న అనేక చిత్రాలలో కొన్నింటిని ఉచితంగా చూసే అవకాశమివ్వాలని నిర్ణయించింది. ఈ నెల 7 నుంచి 21 వరకు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ అవకాశం కల్పిస్తోంది.
ఈ విధంగా స్వాతంత్ర్య దినోత్సవపు చలన చిత్రోత్సవంలో భాగంగా దేశభక్తి ప్రధానాంశంగా ఉన్న చిత్రాలను ప్రేక్షకులకు ఉచితంగా అందుబాటులోకి తెస్తోంది. గాంధీ, రోజా చిట్టగాంగ్, పహెలా ఆద్మీ. ది లెజెండ్ ఆఫ్ భత్ సింగ్, చోటా సిపాయి, ఖాకీ లాంటి చిత్రాలు ఉచితంగా చూడాలనుకునేవారు సినిమాస్ ఆఫ్ ఇండియా డాట్ కామ్ (cinemasofindia.com ) లో లాగిన్ అయి చూడవచ్చు. ఈ నెల 21 వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here