ఒటిటి స్వీయ నియంత్రణ ఒప్పుకోబోమన్న ఎంఐబి

0
621

ఒటిటి వేదికలైన అమెజాన్ ప్రైమ్ వీడియీ, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జియో సినిమా లాంటి స్ట్రీమింగ్ సేవలు స్వీయం నియంత్రణ పేరుతో తమకు తాము విధించుకున్న పరిమితులను ఒప్పుకోవటం లేదని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ (ఎంఐబి) స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రి ప్రకాశ్ జావడేకర్ పార్లమెంటులో స్పష్టం చేయటంతో ఒటిటి కట్టడి తప్పకపోవచ్చునని తెలుస్తోంది.
నిజానికి 17 ఒటిటి సంస్థలు సంతకం చేసిన ఒక లేఖను ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు పంపుతూ తాము స్వీయ నిబంధనలకు కట్టుబడతామని, ఫిర్యాదులు స్వీకరించటానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఒక సలహా మండలి ఉంటుందని తెలియజేసింది. అయితే, ఆ ముగ్గురిలో ఇద్దరు ఈ ఒటిటి వేదికలకు సంబంధించిన వారే కావటంతో నిర్ణయం వాటికే అనుకూలంగా ఉండే అవకాశమున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
పైగా, ఒటిటి వేదికలు ఏర్పరచుకున్న స్వీయ నియంత్రణలో ఎలాంటి అంశాలు ప్రసారం చేయకూడదో పేర్కొనలేదన్నది సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అభ్యంతరం. టీవీ చానల్స్ విషయంలో ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ స్పష్టంగా వ్యవహరిస్తున్నాయని, అలాంటి స్పష్టత ఒటిటి లకు లేదని కూడా అంటోంది.
లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఇచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే ఒటిటి వేదికలమీద సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు అధికారం లేదు. అందుకే దానిని తమ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు లోక్ సభకు మంత్రి తెలియజేశారు. ఈ విషయంలో యూనివర్సల్ సెల్ఫ్ రెగ్యులేషన్ కోడ్ ఫర్ ఆన్ లైన్ క్యురేటెడ్ కంటెంట్ ప్రొవైడర్స్ అనే సంస్థకు మాత్రమే వీటి ప్రసారాలను నియంత్రించే అధికారం ఉన్నా దాని నిబంధనలు కఠినంగా లేవు. ఎ నేపథ్యంలో ఒటిటి సంస్థలన్నీ ఏకగ్రీవంగా నియమావళి సడలించే అవకాశం కనబడటం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here