బ్రైట్ వే, జీ తెలుగు సంయుక్తంగా నిర్వహించిన మహిళా దినోత్సవం

0
523

తెలంగాణలో అతిపెద్ద ఎమ్మెస్వోలలో ఒకటైన బ్రైట్ వే తో కలిసి జీ తెలుగు చానల్ వారు ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవం జరిపారు. బ్రైట్ వే కార్యాలయం వేదికగా జరిగిన ఈ విశిష్ఠ కార్యక్రమంలో బ్రైట్ వే కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సుభాష్ రెడ్డి తో బాటు జీ తెలుగు రెండు రాష్ట్రాల హెడ్స్ శ్రీ ఉమాకాంత్, శ్రీ ఉదయ్ కిరణ్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీ గిరీష్ అతిథులుగా పాల్గొన్నారు.
సమాజంలో వివిధ వృత్తులలో ఎదుగుతూ మహిళలు సాధిస్తున్న విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బ్రైట్ వే లో పనిచేసే మహిళా ఉద్యోగులందరూ కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ జీ తెలుగు వారు ప్రత్యేక కానుకలిచ్చి అభినందనలు తెలియయజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here