వయాకామ్ 18 తో విలీనం చర్చలు నిజం కాదు: జీ

0
344

వయాకామ్ 18 తో విలీనానికి జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సుముఖంగా ఉన్నట్టు, చర్చలు కూడా ప్రారంభించినట్టు వచ్చిన వార్తలను జీ సంస్థ త్రోసిపుచ్చింది, అవి కేవలం ఊహాత్మకమైనవేనని స్పష్టం చేసింది.
ఈ మేరకు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ కంపెనీ సెక్రెటరీ ఆశిష్ అగర్వాల్ డిజిటల్ సంతకంతో ఒక పత్రికా ప్రకటన విడుదలైంది. ఈ వార్తకు ఇంతటితో ముగింపు పలికే లక్ష్యంతో ఇది కేవలం ఊహాగానమేనని కూడా ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. “అలాంటి చర్చలేవీ జరగలేదని ఇందుమూలంగా స్పష్టీకరిస్తున్నాం” అని పేర్కొంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here