ఆంధ్రప్రదేశ్ కు జీ గ్రూప్ విరాళం అంబులెన్సులు, పిపిఇ కిట్స్

0
601

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కోవిడ్ మీద పోరాటానికి సాయం అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు 10 అంబులెన్సులు, 4000 పిపిఇ కిట్లు అందజేసింది. రాష్ట్ర రవాణాశాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎపిఐఐసి చెయిర్ పర్సన్ ఆర్ కె రోజా, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో మల్లికార్జున, అదనపు సీఈవో బి. రాజశేఖర రెడ్ది సమక్షంలో వీటిని జీ సంస్థ అందజేసాసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ మీద జరుపుతున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని జీ సంస్థ భావిస్తున్నట్టు ఎండీ, సీఈవో  పునీత్ గోయెంకా చెప్పారు. అందుకే ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలు పటిష్ఠ పరచటం మీద దృష్టి సారించి ఈ సహాయం అందజేస్తున్నామన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో తమ సాయం కొంతమేరకైననా ఉపయోగపడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

జీ గ్రూప్ చేస్తున్న సాయాన్ని మంత్రి పేర్ని నాని అభినందించారు. సరైన సమయంలో అవసరమైన సాయం చేయటానికి ముందుకు రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఇదే విధంగా సహాయం అందిస్తున్నందుకు జీ సీఈవో పునీత్ గోయెంకాను ప్రత్యేకంగా అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here