జియోను మించి పోయిన ఎయిర్ టెల్ చందాదారులు

0
575

ఇప్పుడు ట్రెండ్ ఒక్క సారిగా తిరగబడింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి మూడు ప్రధాన టెలికామ్ సంస్థలు జారీచేసిన సమాచారం ఈ ధోరణిని తేటతెల్లం చేసింది. మొట్టమొదటి సారిగా అత్యధిక వేగంతో ఎదుగుతున్న డేటా ఆపరేటర్ స్థానం నుంచి జియో ని తొలగించి ఎయిర్ టెల్ ఆ స్థానాన్ని ఆక్రమించింది.  జియో మొబైల్ డేటా ట్రాఫిక్ అంతకు ముందు మూడు నెలలతో పోల్చుకుంటే జులై- సెప్టెంబర్ మధ్య కాలంలో 22 కోట్ల జిబి లకు పెరగగా భారతీ ఎయిర్ టెల్ మరింత వేగంగా 39.1 కోట్ల జీబీలు పెరిగింది. ఇక మూడో ఆపరేటర్ అయిన వోడాఫోన్ ఐడియా విషయానికొస్తే దాని వైర్ లెస్ ట్రాఫిక్ డేటా దాదాపు 18 కోట్ల జీబీల మేరకు తగ్గింది. ఈ పరిస్థితి బాగా ఆశ్చర్యం కలిగించటానికి కారణమేంటంటే ఎయిర్ టెల్ 4జి నెట్ వర్క్ బేస్ స్టేషన్ల సంఖ్య 4 లక్షలు కాగా జియోకు 8 లక్షలున్నాయి. ఎయిర్ టెల్ డేటా ట్రాఫిక్ 5.5% పెరగగా జియీ ట్రాఫిక్ 1.5% మాత్రమే పెరిగింది.

 ఇలా జియో కంటే ఎయిర్ టెల్ డేటా రెట్టింపు పెరగటానికి కారణం కొత్త వాడకందారులను రెట్టింపు సంఖ్యలో పెరగటమే. జియో కి 4జి తో సహా 66.7 లక్షలమంది కొత్తగా చేరగా ఎయిర్ టెల్ కి భారీగా కోటీ 44 లక్షల మంది కొత్త వాడకందారులు చేరారు.   జియో కి గత త్రైమాసికంలో కొత్తగా వచ్చిన చేరినవారు గతంతో పోల్చుకున్నప్పుడు అతి తక్కువ కావటం కూడా గమనార్హం.  లాక్ డౌన్ అమలులో ఉన్న ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కూడా జియీ నెట్ కొత్త చందాదారుల చేరిక కోటీ 8 లక్షల స్థాయిలో ఉంది. ఎయిర్ టెల్ ఎదుగుదల విషయానికొస్తే అది తన 4జి నెట్ వర్క్ లో భారీగా పెట్టుబడి పెడుతోంది. జులై-సెప్టెంబర్ మధ్య కాలంలోనే దాదాపు 30,000 నోడ్స్ జోడించింది.

జియో కు బదులుగా జనం ఎయిర్ టెల్ వైపు ఎందుకలా పెద్ద సంఖ్యలో వెళుతున్నారో స్పష్టమైన కారణం లేకపోయినా ఆరు నెలల కిందట జియో రేట్లు పెంచటమే కొంత వరకు కారణం కావచ్చునని భావిస్తున్నారు. గడిచిన మూడు నాలుగేళ్ళుగా చాలామంది స్మార్ట్ ఫోన్ వాడకం దారులు జియో నుంచి అదనంగా ఒక ప్రీపెయిడ్ కనెక్షన్ తీసుకున్నారు. దీనివలన దాదాపు మిగిలిన ఎయిర్ టెల్, వోడాఫోన్ కంటే అదనంగా 25% డిస్కౌంట్ వచ్చేది.  .

అయితే, వీటన్నిటినీ మించిపోయిన తరువాత జియో తమ టారిఫ్ ను 2019 చివర్లో దాదాపు 25% పెంచింది. ఫలితంగా, జియోకు, మిగతా వాళ్ళకీ మధ్య తేడా మాయమైంది. సహజంగానే చందాదారులు పక్కకు చూశారు.

ఇక ఎయిర్ టెల్ విషయానికొస్తే ఇప్పుడది జియో కి సమానమైన టారిఫ్ కి ఇవ్వజూపుతోంది. ఉదాహరణకు 8 వారాల (56 రోజుల) రోజుకు 2జిబి పాకేజ్ ని భారతి ఎయిర్ టెల్ రూ.449 కి ఇస్తుండగా జియో కూడా అదే పాకేజ్ ని రూ. 444 కి ఇస్తోంది.  అదే విధంగా జియో, ఎయిర్ టెల్ రెండూ ఎనిమిది వారాలకు రోజుకు 1.5 జిబి చొప్పున రూ. 399 కి ఇస్తున్నాయి. నాలుగు వారాల పాకేజ్ ని రూ.199 కి ఇస్తున్నాయి. 12 వారాల పాకేజ్ లో మాత్రమే ఎయిర్ టెల్, జియో మధ్య రూ. 50 నుంచి 100 వరకు తేడా కనబడుతోంది. పెద్దగా ధరలో తేడా లేకపోవటం వల్లనే ఎక్కువమంది చందాదారులు తమ పాత నెంబర్లనే వాడుకుంటూ యాక్టివేట్ చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here