జాతీయ స్థాయిలో నెం.1 స్టార్ మా

0
658

స్టార్ మా మరో మారు జాతీయ స్థాయిలో నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది. బార్క్ విడుదలచేసిన తాజా సమాచారం ప్రకారం మార్చి 11 తో ముగిసిన వారానికి సన్ టీవీ ని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయి టాప్ 10 జాబితాలో స్టార్ గ్రూప్ చానల్స్ 5 ఉండగా జీ, సోనీ, కలర్స్ గ్రూపులు ఒక్కో స్థానం మాత్రమే దక్కించుకున్నాయి.
ఇక తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ విషయానికొస్తే, వారపు సగటు వీక్షణలు మా టీవీకి 23.62 లక్షలు కాగా ఆ తరువాత రెండు స్థానాల్లో ఉన్న జీ తెలుగు (13.23 లక్షలు) ,ఈటీవీ తెలుగు (10.26 లక్షలు) కలిపినా స్టార్ మా కంటే తక్కువ కావటం విశేషం. వీటన్నిటికీ సుదూరంగా ఉన్న జెమినీ టీవీ కేవలం 7.41 లక్షల వీక్షణలతో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే, మూవీ చానల్స్ లో జెమినీ మూవీస్ (5.46 లక్షలు) వీక్షణలతో మొదటి స్థానంలో ఉండటం ఒక్కటే జెమినీ గ్రూపుకు ఊరట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here