మొదటిస్థానం కోల్పోయిన టీవీ9

0
1102

ఒకటిన్నర దశాబ్దానికి పైగా తెలుగు న్యూస్ చానల్స్ లో నెంబర్ వన్ స్థానం కొనసాగించిన టీవీ9 తన ఆధిపత్యం పోగొట్టుకుంది. వరుసగా ఐదు వారాలలోనూ అదే పరిస్థితి కొనసాగగా ఈ ఐదు వారాల సగటు రేటింగ్స్ ప్రకారం 74 జీఆర్పీలతో ఎన్టీవీ మొదటి స్థానంలో ఉండగా 55 జీఆర్పీలకు పరిమితమైన టీవీ9 రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) విడుదల చేసిన ఐదు వారాల సగటు రేటింగ్స్ ప్రకారం తెలుగు న్యూస్ ఛాన్సల్ రాంకులు ఈ విధంగా ఉన్నాయి: ఎన్టీవీ (1), టీవీ 9 (2), వి 6 న్యూస్ (3), టీవీ5 న్యూస్ (4), సాక్షి టీవీ (5), టీ న్యూస్ (6), ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (7), 10 టీవీ (8), హెచ్ ఎం టీవీ (9), మహా న్యూస్ (10), ఈటీవీ ఏపీ (11), ఈటీవీ తెలంగాణ (12), ఐ న్యూస్ (13), రాజ్ న్యూస్ తెలుగు (14).
అనేక ఆరోపణలు, విమర్శలు, రేటింగ్స్ రిగ్గింగ్ మీద పోలీసు దర్యాప్తు మధ్య 2020 అక్టోబర్ లో బార్క్ అధికారులు దేశవ్యాప్తంగా న్యూస్ చానల్స్ రేటింగ్స్ సమాచారం ఇవ్వటం నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఒకవైపు న్యూస్ చానల్స్ సంఘాలనుంచి, మరోవైపు సమాచార,ప్రసార మంత్రిత్వశాఖ నుంచి వత్తిడి రావటంతో మార్చి 17 నుంచి ఇవ్వబోతున్నట్టు బార్క్ ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఈ రోజు న్యూస్ ఛానల్స్ రేటింగ్స్ డేటా విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here