మలయాళం బిగ్ బాస్-3: ప్రేక్షకుల వోట్లతో విజేత ఎంపిక

0
578

మలయాళంలో తిరుగులేని నెంబర్ వన్ స్థానంలో ఉండే ఏషియానెట్ చానల్ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ మూడో సీజన్ అసంపూర్ణంగా ముగిసింది. ముందుగా నిర్ణయిమ్చుకున్న 100 రోజుల రియాలిటీ షో ఇంకా నాలుగు రోజులు ఉండగా మే 19న ఆగిపోయింది. చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ కార్యక్రమం నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా అక్కడి అధికారులు సెట్ కు సీల్ వేశారు. దీంతో అప్పటికప్పుడు విజేతలను దగ్గర్లోని ఒక హోటల్ కు తరలించారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లొ లాక్ డౌన్ ఎప్పుడు పూర్తవుతుందో, మళ్ళీ మామూలు పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలియకపోవటంతో షో ను ఎలా ముగించాలో అర్థం కాక నిర్వాహకులు అయోమయంలో పడ్దారు. అయితే, అన్ని రకాలుగా ఆలోచించిన మీదట ప్రేక్షకుల వోత్ల ఆధారంగా విజేతను నిర్ణయించటం సమంజసమనే అభిప్రాయానికి వచ్చారు.
ఈ కార్యక్రమానికి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొదట్లొ 14 మందిని బిగ్ బాస్ హౌస్ లొ ఉండటానికి ఎంపిక చేసారు. ఆ తరువాత మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదుగురు అదనంగా వచ్చి చేరినా వాళ్ళెవరూ చివరిదాకా మిగల్లేదు. షో షూటింగ్ ఆగిపోయేసరికి ఎనిమిది మంది కంటెస్టెంట్లు మిగిలి ఉండగా వీళ్లకు ఇప్పుడు ప్రేక్షలుకు వేసే వోట్ల ఆధారంగా విజేత ఎవరో తేలిపోతుంది.
ఈ నెల 29 వరకు వోటింగ్ కు అవకాశం కల్పించారు. విజేత తేలినా, గ్రాండ్ ఫినాలే ప్రత్యక్ష ప్రసారం ఎప్పుడనేది మోహన్ లాల్ అందుబాటును బట్టి ఉంటుందని తెలుస్తోంది. దీంతో విజేతను ప్రకటించటానికి మరికొంత సమయం పట్టవచ్చునని భావిస్తున్నారు. ఉత్కంఠ భరితంగా ఉన్న ఈ పరిస్థితి గురించి, విజేత ఎవరనే విషయం మీద సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here