రేషన్‌తో పాటు టీవీ ఫ్రీ

0
614

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం ఇవ్వడంతో పాటు డిష్ టీవీలను కూడా ఇవ్వాలని నిర్ణయించింది. గిరిజన, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తొలుత దీనిని అమలు చేయనున్నారు. దీంతో పాటు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రేడియో ఎఫ్ ఎం ఛానెళ్ల కవరేజీని 80 శాతానికి పైగా పెంచాలని నిర్ణయించింది.

ఏడు లక్షల ఇళ్లలో… అందుకోసం డీడీ ఉచిత డిష్ డీటీహెచ్ లను పంపిణీ చేయాలని డిసైడ్ అయింది. మారుమూల ప్రాంతాల్లో నివసించే పేదలకు డిష్ టీవీలను అందించాలని భావించింది. దీనివల్ల కేంద్రం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశముందని అభిప్రాయపడింది. సెట్‌టాప్ బాక్సులను ఉచితంగా పంపిణీ చేయగలిగితే ప్రసారాలు కూడా నాణ్యతగా వస్తాయని, ఈ కారణంగా గిరిజనుల్లో చైతన్యం పెరుగుతుందని భావిస్తుంది. ఇందుకోసం 2,539 కోట్ల రూపాయలను వెచ్చించాలని నిర్ణయించింది. ఏడు లక్షల ఇళ్లలో ిడిష్ టీవీలు ఉచితంగా ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here