ఓటీటీ మీద ట్రాయ్ లేఖను టీడీశాట్ లో సవాలు చేసిన స్టార్

0
446

ఓటీటీ తదితర వేదికలకు బ్రాడ్ కాస్టర్లు తమ ప్రసారాలను ఏ మాధ్యమం ద్వారా అందిస్తున్నారో తెలియజేయాలంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పంపిన లేఖ మీద అసమ్మతి వేగం మరింతగా పెరిగింది. ఇప్పటికే సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా, సన్ టీవీ ఈ విషయం మీద టెలికాం డిస్ప్యూట్స్ అండ్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ లో సవాలు చేశాయి. దీంతో ఈ విషయంలో ఎలాంటి వత్తిడీ చేయవద్దంటూ ట్రాయ్ కి టీడీశాట్ ఆదేశాలిచ్చింది.
ఇలా ఉండగా ఇప్పుడు స్టార్ కూడా వాటి సరసన చేరింది. ఓటీటీ విషయం ట్రాయ్ పరిధిలోకి రాదుగానుక సమాచారం ఇవ్వాలసిన అవసరం లేదయాంటీ సోనీ, సన్, స్టార్ తెగేసి చెప్పాయి. ఇప్పుడు స్టార్ చేసిన సవాలును కూడా సోనీ, సన్ ఫిర్యాదుతో కలిపి విచారించే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే టారిఫ్ ఆర్డర్ విషయంలో తలకు బొప్పి కట్టిన ట్రాయ్ కి ఇప్పుడు ఇదో తలనొప్పి వ్యవహారంగా తయారైంది.
సోనీ, సన్ చేసిన ఫిర్యాదుల మీద సమాధానం ఇవ్వటానికి ట్రాయ్ కి మూడు వారాల వ్యవధి ఇస్తూ టీడీశాట్ ఈ విషయం మీద ఈనెల 24 న విచారణ చేపట్టబోతోంది. సోనీ, సన్ కోరుతున్నట్టు స్టే ఇచ్చే విషయం మీద ఆరోజు నిర్ణయం తీసుకోవచ్చు. ఈలోగా వాళ్ళు ట్రాయ్ కి సమాచారం ఇవ్వకుండా ఉండేందుకు అవకాశం కల్పించింది.
బ్రాడ్ కాస్టర్లు తాము తయారు చేసిన కంటెంట్ ను వేరు వేరు వేదికల ద్వారా పంపిణీ చేసుకునే హక్కు తమకున్నదని స్పష్టం చేశాయి. ఓటీటీ అనేది బ్రాడ్ కాస్టింగ్ పరిధిలో లేనిదని కూడా గుర్తు చేశాయి. ట్రాయ్ పరిధి శాటిలైట్ చానల్స్ కు మాత్రమే వర్తిస్తుందని, తాము ఓటీటీ వేదికలకు శాటిలైట్ ద్వారా ప్రసారాలు అందించటం లేదని కూడా బ్రాడ్ కాస్టర్లు గుర్తు చేశారు. అయితే, బ్రాడ్ కాస్టర్లకు ఓటీటీ వేదికల పరంగా లేఖలు రాయలేదని, బ్రాడ్ కాస్టర్లుగానే వాళ్ళ నుంచి సమాచారం కోరే హక్కును వాడుకున్నానని ట్రాయ్ వివరించింది. ఏమైనా హద్దు మీరారా అనే విషయం తెలుసుకోవాలనుకున్నట్టు చెప్పింది.
బ్రాడ్ కాస్టర్లు డీకోడర్ బాక్సులు లేకుండా ఓటీటీల మీద టీవీ ప్రసారాలు అందిస్తున్నారన్న విషయం తెలుసుకోవటానికే లేఖ రాశానని ట్రాయ్ వివరణ ఇచ్చింది. సిగ్నల్స్ పునఃప్రసారానికి వాడుకుంటున్న నెట్వర్క్ ఆర్కిటెక్చర్ గురించి మాత్రమే సమాచారం అడిగానని కూడా ట్రాయ్ చెప్పుకుంది. అయితే, బ్రాడ్ కాస్టర్లు డౌన్ లింకింగ్ నియమాలు ఉల్లంఘిస్తే ఆ విషయం ధృవీకరించుకో వచ్చునని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఓటీటీ తన పరిధిలో లేదని స్వయంగా ట్రాయ్ కూడా ఒప్పుకుంది గనుక దానికి సంబంధించిన సమాచారం అడగరాదని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here