స్టార్ మా = ఈటీవీ తెలుగు + జెమినీ టీవీ

0
639

స్టార్ మా చానల్ అఖిలభారత స్థాయిలో నాలుగో స్థానంలోను, తెలుగులో తిరుగులేని మొదటి స్థానంలోను కొనసాగుతోంది. అర్థ సంవత్సరం తేదాలో తెలుగులో మొదలైన రెండు అగ్రశ్రేణి చానల్స్ జెమిని, ఈటీవీ కలిసి మాత్రమే స్టార్ మా కు సమానమైన ప్రేక్షకాదరణ సంపాదించుకోగలిగే పరిస్థితి వచ్చింది. తెలుగులో నెంబర్ టూ స్థానంలో ఉన్న జీ తెలుగు అఖిల భారత స్థాయిలో ఎనిమిదో ర్యాంకులో ఉంది.
జనవరి 30- ఫిబ్రవరి 5 మధ్య వారానికి బ్రాడ్ కాస్ట ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అందించిన సమాచారం ప్రకారం స్టార్ మా (693456), జీ తెలుగు (518919), ఈటీవీ తెలుగు (404429), జెమినీ టీవీ (286004) వరుసగా నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కార్యక్రమాల విషయానికొస్తే, మొత్తం తెలుగు చానల్స్ లో స్టార్ మా సీరియల్స్ నాలుగు మొదటి స్థానాలు సంపాదించుకోగా, జీ తెలుగు సీరియల్ ఐదో స్థానంలో నిలిచింది.
స్టార్ మా సీరియల్స్ కార్తీకదీపం (14088), ఇంటింటి గృహలక్ష్మి (11,078), దేవత (8650), గుప్పెడంత మనసు (7985), వరుసగా మొదటి నాలుగు స్థానాలు దక్కించుకోగా జీ తెలుగు సీరియల్ త్రినయని (7296) ఐదో స్థానంలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here