మార్చి17నుంచి మళ్ళీ న్యూస్ ఛాన్సల్ కు బార్క్ రేటింగ్స్

0
529

దాదాపు 16 నెలల కిందట ఆగిపోయిన న్యూస్ చానల్స్ రేటింగ్స్ మార్చి 17 నుంచి ఇవ్వబోతున్నట్టు బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రకటించింది. దీం తో 2022 సంవత్సరం 10 వ వారానికి ప్రేక్షకాదరణ సమాచారం అందుతుందని స్పష్టమైంది. రేటింగ్స్ సమాచారాన్ని కొన్ని న్యూస్ చానల్ అక్రమ మార్గాల ద్వారా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయన్న ఆరోపణల మధ్య 2020 అక్టోబర్ లో రేటింగ్స్ ఆపివేయటం తెలిసిందే.
ఈ ఏడాడు జనవరి 16 న కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఈ డేటా ను వెంటనే విడిదల చేయాలని బారక్ ను ఆదేశించింది. అయితే, న్యూస్ చానల్స్ ఆశించినట్టుగా వెంటనే ప్రకటించలేదు. ఆ మాటకొస్తే డిసెంబర్ 12 న ఏమైబి అధికారులతో బార్క్ అధికారుల సమావేశం జరిగినప్పుడే 12 వారాలు పడుతుందని వారు స్పష్టం చేశారు. అది పట్టించుకోకుండా ఎం ఐ బి తక్షణం ఇవ్వాలని చెప్పినా బార్క్ మాత్రం తన వెసులుబాటును బట్టే జారీచేయబోవటం గమనార్హం. చట్టపరంగా బార్క్ ను ఆదేశించే హక్కు ఎంఐబి కి లేకపోవటం అందుకు కారణం.
పైగా, ఇప్పుడు ఇచ్చే సమాచారం ఏ వారానికి ఆ వారం ప్రేక్షకాదరణ సమాచారం కాదు. అంతకు ముందు మూడు వారాలకు తాజా వారపు వివరాలు జోడించి నాలుగు వారాల సగటు మాత్రమే బార్క్ వెల్లడిస్తుంది. ఇది ఒక విధంగా న్యూస్ చానల్స్ మీద వత్తిడిని కొంత తగ్గిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం – ఒక్కో న్యూస్ చానల్ సగటున పాతిక లక్షల దాకా బకాయిలు చెల్లించాల్సి ఉండగా, అలా చెల్లించిన చానల్స్ కు మాత్రమే రేటింగ్స్ డేటా ఇవ్వాలని బార్క్ నిర్ణయించుకుంది.
ఇలా ఉండగా, బార్క్ ఇండియా సంస్థ నలుగురు స్వతంత్ర సభ్యులను కూడా బోర్డ్ లో చేర్చుకోబోతోంది. నిజానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ మేరకు సిఫార్సు చేసింది. ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటి అధ్యక్షతన ఏర్పాటైన రేటింగ్స్ కమిటీ కూడా ఇదే విధమైన సిఫార్సు చేయటంతో బార్క్ అందుకు ఒప్పుకుంది. అదే సమయంలో బార్క్ ఛైర్మన్ పునీత్ గోయెంకా పదవీకాలం ముగియటంతో కొత్త ఛైర్మన్ పేరు ఖరారు చేయటానికి త్వరలో సమావేశం జరపబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here