జీ-సోనీ విలీనానికి అడ్డంకి తొలగినట్టేనా?

0
668

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ను దివాలా తీసిన కంపెనీగా ప్రకటించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఇండస్ ఇండ్ బాంక్ మెత్తబడింది. జీ తో ఈ వ్యవహారం సెటిల్ చేసుకుంది. ఈ మేరకు జీ సంస్థ సెబీకి తెలియజేసింది. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో జీ మీద ఇండస్ ఇండ్ బాంక్ వేసిన దివాలా పిటిషన్ మీద ట్రైబ్యునల్ స్టే ఇచ్చింది. దీంతో జీ-సోనీ విలీనం ప్రక్రియకు ఉన్న అవరోధం తొలగి పోయింది.
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, ఇండస్ ఇండ్ బాంక్ సెటిల్మెంట్ ఒప్పందం చేసుకున్నాయని, వివాదాలను పరిష్కరించుకున్నాయని పేర్కొంటూ జీ సంస్థ సెబీకి లిఖితపూర్వకంగా తెలియజేసింది. అంతకు ముందు జీ సంస్థ తనకు రూ. 83.08 కోట్ల బాకీ చెల్లించలేక పోయిందని, అందువలన దివాలా తీసినట్టు ప్రకటించాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో ఫిర్యాదు చేసింది.
దీంతో ట్రైబ్యునల్ ఈ వ్యవహారాలలో నిపుణుడైన సంజీవ కుమార్ ఝా ను మధ్యంతర పరిష్కర్తగా నియమించింది. ట్రైబ్యునల్ ఉత్తర్వును సవాలు చేస్తూ జీ ఎంటర్టైన్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈ ఓ పునీత్ గోయెంకా పిటిషన్ దాఖలు చేయగా స్టే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈలోగా ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. సోనీతో విలీనానికి పూర్తిగా సిద్ధమైన సమయంలో ఈ ఒప్పందం కుదరటం వలన ఆ ప్రక్రియకు ఇక ఎలాంటి అవరోధాలూ ఉండబోవని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here