‘సనా’ లాంటి వాళ్ళు ఉండగా, యాంకర్లెందుకు దండగ!

0
1073

పాతికేళ్ళకిందట రష్యా వాళ్ళు ఒక రోబో న్యూస్ రీడర్ ను తయారు కేశారు. ముందుగా రెడీ చేసిన స్క్రిప్ట్ ఆ రోబో చదివేస్తుంది. అప్పట్లో ఇదొక విచిత్రంగా చెప్పుకున్నారు. కానీ సందర్భానికి తగినట్టు నాలెడ్జ్ జోడించి తెలివిగా మాట్లాడే రోబో యాంకర్ ఇప్పుడు మనముందుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ( కృత్రిమ మేధ) తో పని చేస్తుంది. సందర్భానికి తగినట్టు అవతలి వ్యక్తితో మాట్లాడగలడు.
ఇండియాటుడే గ్రూప్ వారి హిందీ చానల్ ఆజ్ తక్ మొదటిసారిగా ఈ ప్రయోగం చేసింది. రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే బ్లాక్ అండ్ వైట్ కార్యక్రమంలో సుధీర్ చౌధురి తో కలిసి యాంకరింగ్ చేస్తున్న ఈ పాత్రకు వాళ్ళు ‘సనా’ అని పేరు పెట్టారు. రకరకాల డ్రెస్సులూ, హెయిర్ స్టైల్స్ తో కనిపిస్తూ విసుగూ, అలసటా లేకుండా అనేక భాషలలో మాట్లాడగలిగే ఈ యాంకర్ పనితీరు చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
https://www.aajtak.in/india/news/video/ai-news-anchor-sana-bulletin-on-arvind-kejriwal-pm-modi-degree-case-navjot-singh-sidhu-bail-1665629-2023-03-31

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here