కృష్ణ తులసి డబ్బింగ్ వెర్షన్ ’జీ కన్నడ’ లో

0
524

జీ టీవీలో ప్రసారమవుతూ, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న కృష్ణతులసి సీరియల్ ఇప్పుడు కన్నడలో ప్రసారం కాబోతోంది. తెలుగు సీరియల్ ను డబ్ చేసి కృష్న సుందరి పేరుతో రేపటి నుంచి ( మే 17) ప్రసారం చేయటానికి రంగం సిద్ధమైంది. ఇందులో హెచ్ ఐశ్వర్య, దిలీప్ ఆర్ షెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతు తెలిసిందే.
నిజానికి జీ బంగ్లాలో ప్రసారమైన కృష్ణకోలి ను తెలుగులో రీమేక్ చేసి ఈ ఫిబ్రవరి 21 నుంచి జీ తెలుగులో ప్రసారం చేయటం ప్రారంబించారు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావటంతో ఇప్పుడు అదే సీరియల్ కన్నడం లోకి డబ్ అయింది. జీ కన్నడ, జీ కన్నడ హెచ్ డి చానల్స్ లో ఈ సీరియల్ ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు ప్రసారమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here