తెలుగు టీవీ చానల్ రేటింగ్స్ లో చెప్పుకోదగ్గ మార్పేమీ కనబడలేదు. స్టార్ మా (2098) తిరుగులేని నెంబర్ వన్ స్థానం కొన సాగిస్తుండగా జీ తెలుగు (1495) రెండో స్థానంలోను, ఈటీవీ తెలుగు (1237) మూడో స్థానంలోను, జెమినీ టీవీ (828) నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. కార్యక్రమాల విషయానికొస్తే టాప్ 5 లో మొదటి నాలుగూ స్టార్ మా సీరియల్స్ దక్కించుకోగా ఐదవ స్థానం జీ తెలుగు వారి ప్రేమ ఎంత మధురం (6883) సీరియల్ కు దక్కింది. కార్యక్రమాల్లో స్టార్ మా వారి కార్తీక దీపం (13545) మొదటి రాంక్, ఇంటింటి గృహలక్ష్మి (11336) రెండో రాంక్, దేవత (8750) మూడో రాంక్, గుప్పెడంత మనసు (7934) నాలుగో స్థానం సంపాదించుకున్నాయి.