భారత తొలి ప్రైవేట్ శాటిలైట్ చానల్ జీ 30 వ వార్షికోత్సవం

0
681

భారతదేశపు తొలి భారతీయ ప్రైవేట్ శాటిలైట్ చానల్ 30 వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 29 సంవత్సరాల క్రితం ఇదే రోజు సుభాష్ చంద్ర ప్రైవేట్ రంగంలో తొలి హిందీ చానల్ ప్రారంభించి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు 45 చానల్స్ కు ఎదిగి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల ఇళ్ళకు చేరుతోంది. ఎంటర్టైన్మెంట్ రంగంతోబాటు న్యూస్ మొదలుపెట్టి ఆ తరువాత సినిమాలు, కార్యక్రమాల నిర్మాణంలోనూ, పంపిణీ కోసం సిటీకేబుల్, డీటీహెచ్ వేదిక డిష్ టీవీ ప్రారంభం తోనూ విస్తరణలో కొత్త పుంతలు తొక్కింది. ఆ విధంగా వినియోగదారుల ఇళ్ళలోకే కాకుండా వాళ్ళ హృదయాలలోకి చొచ్చుకుపోయింది.

ఎప్పటికప్పుడు కొత్తదనంతో అనేక ప్రయోగాలతో దూసుకుపోతూ ఎదుగుదల మీద, విస్తరణమీద దృష్టి పెట్టటంతోబాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రేక్షకులకోసం అనేక చానల్స్ ప్రారంభించటం ద్వారా విశేష ప్రజాదరణ చూరగొన్నది. ఈసారి సోనీతో విలీనం వార్త కూడా ఈ 30 వ వార్షికోత్సవానికి మరింత వెలుగు తెచ్చింది. 29 ఏళ్ళు పూర్తిచేసుకొని 30 వ ఏట అడుగుపెడుతున్న సమదర్భంగా జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఎండీ, సీఈవో తన హృదయపూర్వక సందేశాన్నిస్తూ ఈ అద్భుత ప్రయాణాన్ని నెమరువేసుకున్నారు.

“29 ఏళ్ల కిందట ఇదే రోజున ఈ అనే ఈ అతిపెద్ద వ్యవస్థకు బీజం పడింది. అప్పట్లో చాలామంది ఇది అసాధ్యమైన ఆలోచన అని, దుస్సాహసమని అభిప్రాయపడ్డారు. కానీ పట్టుదల, ప్రేమ, అంకితభావం ఆ అనుమానాలను పటాపంచలు చేశాయి. అందువల్లనే ఈ రోజు ఇక్కడ ఇలా ఉత్సాహంగా వేడుక జరుపుకుంటూ ఒక కీలకమైన మైలురాయి చేరుకున్నాం. ఒక అంతర్జాతీయ సంస్థ స్థాయికి ఎదగటం సాధారణమైన విషయం కాదు. అందరం కలిసి 30 వ ఏట అడుగు పెడుతున్న సమయంలో మరిన్ని విజయాలకోసం, ఎదుగుదలకోసం అంకితభావంతో కృషిచేద్దామనే దీక్ష తీసుకుందాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here