ఆలిండియా టాప్ 10 లో స్టార్ మా, జీ తెలుగు

0
572

గతవారం లాగానే ఈ సారి కూడా స్టార్ మా తెలుగు, జీ తెలుగు చానల్స్ ఆలిండియా టాప్ 10 లో స్థానం సంపాదించుకున్నాయి.  సన్ టీవీ మొదటి స్థానంలో ఉండగా ఆ తరువాత ప్రముఖ హిందీ చానల్స్ అతమ ఆధిక్యాన్ని చాటుకుంటూ వస్తున్నాయి. తెలుగు, తమిళం మినహాయిస్తే మరే ప్రాంతీయ చానల్స్ కూ మొదటి పది రాంకుల్లో స్థానం దక్కలేదు.

  

నాలుగు ప్రముఖ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ అదే క్రమంలో రాంకులు కాపాడుకుంటూ వస్తున్నాయి. స్టార్ మా మొదటి స్థానంలోను, జీ తెలుగు రెండో స్థానంలోనూ ఉండగా ఈటీవీ తెలుగు మూడో స్థానంలో, జెమినీ టీవీ నాలుగో స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి.

 

కార్యక్రమాల విషయానికొస్తే, స్టార్ మా సీరియల్ కార్తీక దీపం ఎదురులేని మొదటి స్థానంలో నిలిచింది. స్టార్ మా సీరియల్క్స్ ఇంటింటి గృహలక్ష్మి,  వదినమ్మ సీరియల్స్ రెండు, ఐదు స్థానాలు దక్కించుకోగా ఈటీవీ కార్యక్రమం ఢీ ఛాంపియన్స్ మూడో రాంకులో, జీ తెలుగు సీరియల్ ప్రేమ ఎంత మధురం నాలుగూ రాంకులో నిలబడ్డాయి. ఇప్పటిదాకా టాప్ 5 కార్యక్రమాల్లో స్థానం నిలబెట్టుకుంటూ వస్తున్న ఈటీవీన్యూస్ ఈ వారం కిందికి జారింది.

 

న్యూస్ చానల్స్ లో టీవీ9 మొదటి స్థానంలో ఉండగా ఎన్టీవీ రెండో స్థానం, టీవీ 5 న్యూస్,  వి 6 న్యూస్ నాలుగో స్థానం అదే విధంగా కొనసాగిస్తున్నాయి.  ఐదో స్థానంలో ఉన్న టి న్యూస్ ఈ సారి కిందికి పడిపోగా, 10టీవీ తాజాగా ఐదో రాంకు సంపాదించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here