ఐపిఎల్ ప్రసార హక్కులు యప్ టీవీకి

0
660

దక్షిణాసియా కార్యక్రమాల ప్రసారంలో ముందుండే ఒటిటి వేదిక యప్ టీవీ దాదాపు వందదేశాలలో ఐపిఎల్ -2021 ప్రసారం చేయటానికి డిజిటల్ ప్రసార హక్కులు సొంతం చేసుకుంది. దీంతో యప్ టీవీ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఐపిఎల్ ప్రసారాలు అందించబోతోంది. ఆ విధంగా యప్ టీవీ ప్రేక్షకులు ఐపిఎల్ 2021లో భాగమైన 60 టి20 మాచ్ లు చూసి ఆనందించగలుగుతారు.
లాక్ డౌన్ కారణంగా 2020 లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వేదిక మార్చుకున్న అనంతరం ఇప్పుడు మళ్లీ భారత్ కు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9- మే 30 మధ్య జరిగే ఉత్కంఠభరితమై ఐపిఎల్ 2021 మాచ్ లను యప్ టీవీ ప్రసారం చేస్తుంది. దీనికి చెన్నై, ముంబై, అహమ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా నగరాలు వేదికలు అవుతాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన అహమ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్స్ జరుగుతాయి. ఈ అవకాశాన్ని యూరప్ ఖండంతోబాటు ఆస్త్రేలియా, శ్రీలంక, సింగపూర్, మలేసియా మినహా ఆగ్నేయాసియా . దక్షిణ, మధ్య అమెరికా, మధ్య ఆసియా, నేపాల్, భూటాన్ దేశాల ప్రజలకు యప్ టీవీ అందించబోతోంది.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ప్రత్యేక స్థానం ఉండగా అందులో ఐపిఎల్ స్థానం విశిష్ఠమైనదని , ప్రేక్షకులు కూడా దీనికి అదే స్థాయిలొ ఉన్నారని యప్ టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మళ్లీ భారత్ కి తిరిగి రావటంతో ప్రేక్షకులు మరింతగా ఆనందిస్తారని వ్యాఖ్యానించారు. అభిమానులు ఇళ్ళలో కూర్చొని క్రికెట్ ఆనందించటానికి తమ వేదిక అందుబాటులో ఉంటుందన్నారు. 14 భాషల్లో 250 కి పైగా టీవీ చానల్స్, సినిమాలు, 100 కు పైగా టీవీ షోలు అందిస్తున్న యప్ టీవీ ఇప్పుడు క్రికెట్ అభిమానులు ఇళ్ళలో ఉండి కూడా స్టేడియంలో క్రికెట్ చూస్తున్న అనుభూతిని అందించబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here