ప్రైమ్ వాలీబాల్ లీగ్ ప్రచారం ప్రారంభించిన సోనీ స్పోర్ట్స్

0
701

వచ్చే ఫిబ్రవరి 5 నుంచి ప్రైమ్ వాలీబాల్ లీగ్ పోటీలు ప్రసారం చేయటానికి సోనీ సిద్ధమైంది. అందులో భాగంగానే సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఒక ప్రచార వీడియోను రూపొందించి విడుదల చేసింది. ప్రైమ్ వాలీబాల్ లీగ్ పోటీలు సోనీ టెన్ 1, సోనీ టెన్ 3 ( హిందీ), సోనీ టెన్ 4 (తెలుగు, తమిళం) లో ప్రసారమవుతాయి.

ఈ ప్రచార చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అన్నీ సోనీ స్పోర్ట్స్ చానల్స్ లో అందుబాటులో ఉంది. ప్రతి భారతీయుడూ వాలీబాల్ ఆడుతూనో, చూస్తూనో పెరిగినవాడేనన్న వాస్తవాన్ని గుర్తు చేస్తూ ఈ వీడియో సాగుతుంది. వాలీబాల్ ఎక్కడ ఆడుతున్నా వయోభేదం లేకుండా గుంపులు గుంపులుగా చూస్తుంటారు. ఆ కోణంలోనే ఈ ప్రచార చిత్రం కూడా వాలీబాల్ ప్రాధాన్యాన్ని చెప్పింది.

దేశీయ క్రీడలను ప్రజలకు చేర్చాలన్న తాపత్రయంతోనే సోనీ ఈ కృషి చేస్తోందని సంస్థ ఇండియా ఛీఫ్ రెవెన్యూ ఆఫీసర్ రాజేశ్ కౌల్ చెప్పారు. ఈ ప్రచార చిత్రం భారతీయ వాలీబాల్ క్రీడాభిమానుల మనోభావాలకు అద్దం పడుతుందని, వాలీబాల్ చూస్తూ ఎదిగినవాళ్లను మరింతగా ఆకట్టుకుంటూ బాల్య స్మృతుల్లోకి తీసుకువెళుతుందని అన్నారు. క్రీడాకారుల నిజమైన ప్రతిభను చాటిచెప్పే వాలీబాల్ ను చూపించటం ద్వారా యువతలో శక్తిని, పెద్దవాళ్ళలో జ్ఞాపకాలను నింపాలనుకుంటున్నట్టు చెప్పారు.

ఈ లీగ్ లో మొత్తం ఏడు జట్లు పాల్గొంటాయి: కాలికట్ హీరోస్, కొచ్చి బ్లూ స్పీకర్స్, అహమ్మదాబాద్ డిఫెండర్స్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టార్పేడోస్, కోలకతా థండర్ బోల్ట్స్. ఈ లీగ్ లో 24 పోటీలు జరుగుతాయి. అశ్వాల్ రాయ్, కార్తీక్, దీపేశ్ కుమార్ సింహా, జేరోమ్ వినీత్ లాంటి పేరుమోసిన ఆటగాళ్లు పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here