డిష్ టీవీలో విద్యా చానల్స్

0
492

కేంద్ర ప్రభుత్వం వారి స్వయం ప్రభ, కేరళ ప్రభుత్వం వారి కైట్ విక్టర్స్ చానల్స్ ప్రసారం చేస్తూ వస్తున్న డిష్ టీవీ ఇప్పుడు తాజాగా తమిళనాడు ప్రభుత్వం వారు విద్యా చానల్ (కల్వి తొలైకాచ్చి) ప్రసారం కూడా ప్రారంభించింది. ఈ ఉచిత చానల్ ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటలవరకు ప్రసారమవుతుంది. డిష్ టీవీతో బాటు దాని భాగస్వామి డి2హెచ్ (గతంలో వీడియోకాన్ సంస్థ వారి డిటిహెచ్) లో కూడా ఈ చానల్ అందుతుంది.
డిష్ టీవీలోను, డి2హెచ్ లోను చానల్ నెంబర్ 597 నెంలో కల్వి తొలైకాచ్చి అందుబాటులో ఉంది. విద్యార్థుల సృజనాత్మకత పెంచటానికి, పోటీ పరీక్షల సామర్థ్యం పెంచటానికి తమిళనాడు ప్రభుత్వం నిపుణులైన, అనుభవజ్ఞులైన ఆధ్యాపకుల సాయంతో ఈ కార్యక్రమాలు రూపొందించింది. అదే విధంగా విద్యార్థులకు సంబంధించిన అన్ని ప్రకటనలూ ఇందులో ప్రసారమవుతాయి. తమిళనాడు ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ నిర్వహించే ప్రత్యక్ష ప్రసారాలు కూడా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి.
కోవిడ్ కారణంగా పాఠశాలల గమనం తీవ్రంగా దెబ్బతిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన అందుబాటులోకి రావటానికి ప్రభుత్వ చానల్ కల్వి తొలై కాచ్చి ద్వారా ప్రసారం చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలొని అరసు కేబుల్ ద్వారా, కొన్ని ప్రైవేట్ న్యుస్ చానల్స్ లో సమయం కొనుక్కొని కూడా ప్రసారం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు తాజాగా డిటిహెచ్ మార్గాన్ని ఎంచుకుంది. విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉంటూ నాణ్యమైన విద్య అందుకోవటంలో తాము కూడా పాత్ర పోషించటం సంతోషంగా ఉందని డిష్ టీవీ నిర్వాహకులు చెబుతునన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here