ఎన్టీవో2.0: పే చానల్స్ కొత్తధరలు ప్రకటించిన కలర్స్, సోనీ

0
694

కొత్త టారిఫ్ ఆర్డర్ ఎన్టీవో 2.0 కు అనుగుణంగా వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేలా సోనీ, కలర్స్ యాజమాన్య సంస్థలు తమ కొత్త పే చానల్ ధరలు ప్రకటించాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలను పాటించే క్రమంలో ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సిన ఎన్టీవో 2.0 ప్రకారం ధరలు ప్రకటించాల్సి ఉంది. దీంతో టీవీ 8, నెట్వర్క్ 18, వయాకామ్ 18 యాజమాన్య సంస్థ అయిన ఇండియాకాస్ట్ తన పరిధిలోని 59 చానల్స్ కొత్త ధరలను ప్రకటించింది. అదే సమయంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా సంస్థ కూడా తన ఆధ్వర్యంలోని 16 చానల్స్ ధరలు కూడా ప్రకటించింది.
అయితే, ఇందులో వయాకామ్ 18 తాత్కాలికంగా స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ 18 హెచ్ డి అని పేర్లు పెట్టిన రెండు చానల్స్ ను కూడా ఈ కొత్త రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ లో చేర్చి వాటి ధర రూ, 12 గా ప్రకటించినప్పటికీ ఆ చానల్స్ ప్రవేశ పెట్టటాన్నిబట్టి వాటి ధరలు అమలవుతాయని ఇండియాకాస్ట్ ప్రకటించింది. ఒకవేళ తమ స్పోర్ట్స్ ఛానల్స్ ప్రవేశ పెట్టే తేదీ విషయంలో ఏదైనా మార్పు ఉంటే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తామని ఆర్ ఐ ఒ లో పేర్కొంది.
వయాకామ్ 18 వారి ప్రధాన చానల్ కలర్స్ (రూ.21), కలర్స్ హెచ్ డి (రూ,23), ప్రాంతీయ చానల్స్ కలర్స్ కన్నడ (రూ. 21), కలర్స్ కన్నడ హెచ్ డి (రూ.23), కలర్స్ మరాఠీ హెచ్ డి (రూ.17) ఏ బొకేలోనూ కలపకుండా విడిగా ఇస్తారు. ఎన్టీవో 2.0 లో ట్రాయ్ నిర్దేశించిన ప్రకారం బొకేలో చేర్చే చానల్ ధర రూ.12 దాటకూడదు. ఈ నెట్ వర్క్ ఆధ్వర్యంలో నడిచే కలర్స్ సినీప్లెక్స్ బాలీవుడ్ చానల్ ను ఇకమీదట ఉచిత చానల్ గా కాకుండా ఏప్రిల్ 1 నుంచి పే చానల్ గా మార్చి ధర 10 పైసలుగా నిర్ణయించినట్టు కూడా పేర్కొన్నారు.
సోనీ ధరలు
సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ఎస్ పి ఎన్ ఐ) ఆధ్వర్యంలో 16 చానల్స్ ఉండగా అది కూడా తన కొత్త ధరలు ప్రకటించింది. అందులో జనరల్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, హిందీ సినిమాలు, కిడ్స్ , ఇన్ఫోటైన్మెంట్ చానల్స్ కూడా ఉన్నాయి. గతంలో రూ.19 గా ప్రకటించిన ధరలను ఇప్పుడు పెంచటం గమనించవచ్చు, సోనీ సబ్ (రూ.23), సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ (రూ.24) స్పోర్ట్స్ చానల్ సోనీ సిక్స్ (రూ. 20), సోనీ టెన్ 1( రూ.20) , సోనీ టెన్ 2 (రూ.20), సోనీ టెన్ 3 ( రూ.12), సోనీ టెన్ 4 ( రూ.12) గా నిర్ణయించారు. గతంలో రూ. 2 గా ఉన్న పిల్లల చానల్ సోనీ యే! ని, ఇన్ఫోటైన్మెంట్ చానల్ సోనీ బీబీసీ ఎర్త్ ని రూ. 3 కు పెంచారు. అదే సమయంలో హిందీ సినిమాల చానల్ సెట్ మాక్స్ ధరను రూల్ 15 నుంచి రూ.12 కి తగ్గించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here