డిజిటల్ ఎమ్మెస్వో అవతారమెత్తిన యప్ టీవీ

0
632

ఇప్పటిదాకా ఒటిటి వేదికగా పేరుతెచ్చుకున్న యప్ టీవీ ఇప్పుడు కేబుల్ టీవీ మార్కెట్ లో ప్రవేశిస్తోంది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నుంచి అ మేరకు లైసెన్స్ కూడా తీసుకుంది. 2020 జులై 28 న మంజూరు చేసిన ఈ లైసెన్స్ పదేళ్ళపాటు అమలులో ఉంటుంది. తన రంగంలో ఎంతో పేరుతెచ్చుకున్న యప్ టీవీ ఇప్పుడలా కేబుల్ రంగం గురించి ఆలోచించటం మీదనే పరిశ్రమ తీవ్రంగా చర్చించుకుంటోంది. జులై లో సమాచార ప్రసార మంత్రిత్వశాఖ జారీ చేసిన 17 డిజిటల్ ఎమ్మెస్వో అనుమతులలో యప్ టీవీ కూడా ఒకటి. తాజా జాబితాను జులై 4 మంత్రిత్వశాఖ తన వెబ్ సైట్ లో ఉంచింది.

ఇప్పటిదాకా కంటెట్ అగ్రిగేటర్ గా ఉన్న యప్ టీవీ 14  భాషలలో 250కి పైగా చానల్స్, 5000కు పైగా సినిమాలు, 100కు పైగా సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉంచింది. తన వేదికలో 25000  గంటల ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఉండగా, రోజుకు 2500 గంటల ఆన్ డిమాండ్ కంటెంట్ జోడిస్తూ వస్తున్నట్టు చెప్పుకుంటోంది.

తన ఎదుగుదలకు టెక్నాలజీని పెద్ద్ ఎత్తున వాడుకుంటూ వస్తున్న యప్ టీవీ తన చందాదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా టీవీ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, టాబ్, బ్లూ రే ప్లేయర్, ఇంటర్నెట్ సెట్ టాప్ బాక్స్ లాంటి రకరకాల తెరలమీద వినోదం అందుబాటులో ఉంచగలుగుతుంది. ఈ మధ్య కాలంలో యప్ మాస్టర్ పేరుతో ఐఐటి జీఈఈ, నీట్ అభ్యర్థులకు ఆన్ లైన్ శిక్షణ కూడా ప్రారంభించింది.

అయితే, ఇప్పుడు ఎమ్మెస్వో లైసెన్స్ తీసుకోవటం వెనుక వ్యూహం ఏమిటన్నది మాత్రం ప్రస్తుతానికి ఇంకా వెల్లడి కాలేదు. కేబుల్ చానల్ నడపాలనుకుంటే మాత్రం  ఇప్పుడున్న నియమనిబంధనల ప్రకారం ఎలాంటి లైసెన్సూ అక్కర్లేదు. అలా కాకుందా పంపిణీ రంగంలో ఒక ఎమ్మెస్వోగా అడుగుపెట్టటమే లక్ష్యమనుకుంటే చాలా దూకుడుగా స్థానిక కేబుల్ ఆపరేటర్లతో బేరసారాలు సాగించి తన పరిధిలోకి తీసుకోవాల్సి ఉంటుంది. డిజిటైజేషన్ తరువాత సంతృప్త స్థాయికి చేరుకున్న మార్కెట్ లో ఇదేమంత ఆషామాషీ వ్యవహారం కూడా కాదు. ఇలాంటప్పుడు యప్ టీవీ అనుసరించబోయే వ్యూహం ఏమిటో వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here