2022 ఆసియా క్రీడల ప్రసార హక్కులు దక్కించుకున్న సోనీ

0
225

ఈ సంవత్సరం చైనా లో జరిగే 19 వ ఆసియా క్రీడల ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు ఆసియా క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ఈ క్రీడల ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. జీ-సోనీ విలీనం ప్రకటించిన తరువాత స్పోర్ట్స్ వ్యాపారంలో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్న సమయంలో సోనీ ఆ హక్కులు సంపాదించుకోవటం గమనార్హం.

ఈ క్రీడల ప్రసారాలను భారత దేశంతో పాటు భారత ఉపఖండం దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ లో ప్రసారం చేసుకోవడానికి సోనీ హక్కులు సంపాదించుకుంది. చైనాలోని 5 నగరాల్లో జరిగే ఆసియా క్రీడలలో 40 క్రీడాంశాలు 61 విభాగాల్లో క్రీడాకారులు పోటీపడబోతున్నారు.

ఈత, విలువిద్య. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, ఫుట్ బాల్, హాకీ, కబడ్డీ తదితర అనేక అంశాలలో పోటీలు జరుగుతాయి. ఈ సారి క్రీడలలో ఈ-స్పోర్ట్స్, బ్రేక్ డాన్స్ కూడా చేరుతున్నాయి వీటికి ఈ సంవత్సరం ఏషియా ఒలంపిక్ కౌన్సిల్ ఆమోదం తెలియజేసింది. అదే సమయంలో టి20 ఫార్మాట్ లో క్రికెట్ మళ్ళీ ప్రవేశిస్తోంది.

మొట్టమొదటిసారిగా 300 మందికి పైగా అథ్లెట్లు ఈసారి ఏషియన్ గేమ్స్ లో పాల్గొనబోతున్నారు ఈ సంవత్సరం లో జరిగే అతి పెద్ద క్రీడా పోటీ కి భారత్ హక్కులు సంపాదించడం పట్ల సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ రాజేష్ కౌల్ సంతోషం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here