ఈటీవీ కి రెట్టింపు ఆదరణతో స్టార్ మా; జాతీయ స్థాయిలో నెం. 2

0
612

స్టార్ మా జాతీయ స్థాయిలో నెంబర్ 2 స్థానానికి చేరింది. గతంలో సన్ టీవీ మొదటి స్థానం సైతం సంపాదించినా తెలుగు చానల్ మొదటి సారిగా ఈ ఘనత సాధించినట్టయింది. టీవీ ప్రేక్షకాదరణ లెక్కించే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) అందించిన తాజా సమాచారం (జులై 31-ఆగస్టు 6 మధ్య వారానికి) ప్రకారం స్టార్ ప్లస్, స్టార్ మా, సన్ టీవీ జాతీయ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
కొంతకాలంగా మూడో స్థానంలో ఉన్న స్టార్ మా ఇప్పుడు పైకి రావటంతో సన్ టీవీ వెనుకబడి మూడో రాంకుకు పరిమితమైంది. మొదటి స్థానంలో స్టార్ ప్లస్ కొనసాగటమే కాకుండా టాప్ 5 లో స్టార్ గ్రూప్ కు చెందిన మూడు చానల్స్ – స్టార్ ప్లస్, స్టార్ మా, స్టార్ ఉత్సవ ఉండటం గమనార్హం.
జీ గ్రూప్, సోనీ, వయాకామ్ 18 లాంటి గ్రూపులు టాప్ 5 లో చోటు సంపాదించుకోలేకపోయాయి. టాప్ 10 లో జీ గ్రూప్ చానల్స్ జీ తెలుగు, జీ అన్మోల్ ఉన్నాయి. ఆ విధంగా జీ గ్రూప్ లోనూ జీ తెలుగు చానల్ ముందుండటం విశేషం.
తెలుగు చానల్స్ లో స్టార్ మా (2540) మొదటి స్థానంలో ఉండగా జీ తెలుగు (1558) చాలా దిగువన రెండో స్థానంలోనూ . ఈటీవీ తెలుగు (1271) మూడో స్థానంలోనూ, జెమినిటీవీ (877) నాలుగో స్థానంలోనూ నిలిచాయి. స్టార్ మా లో జీ తెలుగు వాటా సుమారు 60% కాగా స్టార్ మా లో జెమినీ వాటా 35% కూడా లేకపోవటం గమనార్హం. స్టార్ మా లో ఈటీవీ సరిగా సగమే కావటం కూడా చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here