కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థకు పురుడుపోసి దేశంలో ఎం.ఎస్.ఓ. రూపకల్పన చేసిన మొదటి సంస్థ సిటికేబుల్

0
520

కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థకు పురుడుపోసి దేశంలో ఎం.ఎస్.ఓ. రూపకల్పన చేసిన మొదటి సంస్థ సిటికేబుల్. అటువంటి సంస్థ సంస్థాగత తప్పిదాలు చేస్తుండటం ఎల్.సి.ఓ.లను విస్తుపరుస్తుంది. ఎల్.సి.ఓ.ల ప్రోత్సాహం వల్లనే ఎన్నో ప్రత్యామ్నాయాలు వచ్చినా ఇప్పటికి 14 Lakhs కనెక్టివిటీ తో ఇరు తెలుగు రాష్ట్రాలలో మనుగడలో ఉంది అని విషయాన్ని గమనించాలి. ఏ.పి.ఫైబర్ లాంటి సంస్థ 2కె సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్.సి.ఓ.లను ప్రభుత్వం నేరుగా ప్రోత్సాహం కోరినా ఎవ్వరు స్పందించలేదు. ఇప్పుడు రిలయన్స్ జియో ద్వారా ఎల్.సి.ఓ. లను భయబ్రాంతులను చేస్తుంటే ఎల్.సి.ఓ.లకు భరోసాను ఇచ్చి మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎల్.సి.ఓ.లకు అందించాల్సిన సిటీ కేబుల్ ఈ విదంగా ఎల్.సి.ఓ. లపై దాడి చేయటం దురదృష్టం. అదీను ఒక దేశవ్యాప్త కార్పొరేట్ సంస్థ ఇంత చౌకబారుగా వ్యాపారం చేయటం నైతిక విలువలకు తూట్లు పొడవటమే. దీన్ని పరిష్కరించి సిటికేబుల్ యాజమాన్యం పెద్దరికం నిలబెట్టుకోవాలని ఆశిద్దాం🙏

Cable TV

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here