ఇండియా హాజ్ గాట్ టాలెంట్ ఇక సోనీ టీవీలో

0
507

మ్యూజిక్ లో, డాన్స్ లో ప్రతిభ ఉన్నవాళ్ళకోసం టీవీ చానల్స్ లో చాలా కార్యక్రమాలున్నాయి. మిగతా అనేక విషయాలలో అరుదైన ప్రతిభ ఉన్నవాళ్ళ కోసం 2006లో అమెరికా హాజ్ గాట్ టాలెంట్ పేరుతో ప్రసారమైన కార్యక్రమం విశేషంగా ప్రేక్షకులను అకట్టుకుంది. వెంటనే ఆ కాన్సెప్ట్ హక్కులు కొనుక్కొని ఎవరికివాళ్ళు వాళ్ళదేశం పేరు తగిలించి “గాట్ టాలెంట్” కార్యక్రమం రూపొందిస్తూ వస్తున్నారు.
ఆ విధంగా ఈ నమూనాను ఇప్పటికి 70 దేశాలకు పైగా అనుసరించటం విశేషం. వయసు గాని, ఆడామగా తేడాగాని, ఒకరూ ఇద్దరా, బృందమా అనే తేడాగానీ లేకుండా అందరికీ అవకాశం కల్పిస్తారు. భారతదేశంలో కూడా ఇండియా హాజ్ గాట్ టాలెంట్ పేరుతో కార్యక్రమం ప్రసారం కావటం తెలిసిందే. కొంతకాలం కలర్స్ లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఇప్పుడు సోనీకి మారింది. ఇలాంటి అంతర్జాతీయ ఫార్మాట్స్ కు భారతదేశ హక్కులు కొనుక్కొని చానల్స్ కు అమ్మటం కొత్తేమీకాదు. హూ వాంట్స్ టు బి ఎ మిలియనేర్ కూడా కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో హిందీలో, ఆ తరువాత 7 ప్రాంతీయ భాషలకు కూడా విస్తరించిన సంగతి తెలిసిందే.
“గాట్ టాలెంట్“ భారతదేశపు హక్కులు కొనుక్కున్న ఫ్రీమాంటిల్ ఇండియా సంస్థవారు ఇంతకాలం కలర్స్ తో కలిసి పనిచేశారు. ఇప్పుడు సోనీని ఎంచుకున్నారు. త్వరలో సోనీలో ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది. వేలాదిమంది పోటీపడుతున్న ఈ ప్రోగ్రామ్ లో వడపోత పూర్తయ్యాక అసలు షూటింగ్ మొదలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here