త్వరలో జీ తెలుగు ఆర్టిస్టులు, సిబ్బందికి టీకాలు

0
414

కోవిడ్ రెండో వేవ్ ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతూ మళ్లీ పనులు మొదలవుతున్న సమయంలో అన్ని సంస్థలూ తమ సిబ్బందిని మళ్ళీ కార్యాలయాలకు, పనిప్రదేశాలకు ఆహ్వానిస్తున్నాయి. అదే సమయంలో అందరి భద్రతను, మూడో వేవ్ భయాన్ని ధృష్టిలోపెట్టుకొని టీకాలు వేయించుకోవాలని ప్రత్యేకంగా నచ్చజెబుతున్నాయి. అలాంటి యాజమాన్యాల జాబితాలోకి టీవీ పరిశ్రమ కూడా వచ్చి చేరింది. ఇప్పటికే లాక్ డౌన్ ఫలితంగా పనులు నిలిచిపోయి సంస్థలకూ, వ్యక్తులకూ నష్టం జరిగిన నేపథ్యంలో ఇకముందు అల జరగకూడదనే కృతనిశ్చయంతో ఉన్నాయి.
ఈ భయంకరమైన వైరస్ ను తట్టుకోవటానికి టీకాలొక్కటే మార్గం గనుక ఎలాంటి భయాలూ లేకుండా షూటింగ్స్ జరపాలంటే సిబ్బంది మొత్తం టీకాలు వేయించుకోవాలని ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇప్పటికే పిలుపునిచ్చింది. మీడియా, ఎంటర్టైన్మెంట్ సిబ్బందికి దాదాపు 10 వేలమందికి టీకాలిప్పించటం పూర్తయిందని సంస్థ అధ్యక్షుడు నాడియావాలా చెప్పారు.
సాధారణ సిబ్బందికి ఉచితంగాను, పెద్ద స్థాయి టెక్నీషియన్లకు నామమాత్రపు రుసుము తోనూ టీకాలిస్తున్నారు. ఈ టీకాల కార్యక్రమానికి మోషన్ పిక్చర్స్ అండ్ టీవీ ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నిధులు సమకూరుస్తోంది. ఇండియన్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్స్ సంఘం కూడా జూన్ 1న ఒక భారీ శిబిరం నిర్వహించింది.
బ్రాడ్ కాస్టర్లు కూడా ఈ విషయంలో ముందున్నారు. జీ ఎంటర్టైన్మెంట్ తన నటీనటులకు, టెక్నీషియన్లకు, సిబ్బందికి టీకాలిప్పిస్తోంది. ఇప్పటికే జీ కన్నడ, జీ బంగ్లా అలాంటి కోవిడ్ టీకా శిబిరాలు నిర్వహించగా త్వరలో జీ తెలుగు కూడా టీకాలివ్వటానికి సిద్ధమవుతోంది. మూడో వేవ్ భయం పెరుగుతున్న సమయంలో టీకా వేయించుకున్నవారినే షూటింగ్ కు అనుమతించే అవకాశం ఉందవచ్చునన్న వార్తల మధ్య జీ గ్రూప్ తమ చానల్స్ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here