నకిరేకల్,* నల్లగొండ జిల్లా.*

0
236

హలో కేబుల్ ఆపరేటర్ చలో హైదరాబాద్*

కేబుల్ వినియోగదారుల పట్ల భారం మోపుతూ,చిన్న కేబుల్ ఆపరేటర్ ల మనుగడను దెబ్బతీసేలా ట్రాయ్ తీసుకున్న NTO2 Price విధానమును వెంటనే ఉపసంహరించుకోవాలని,ఈనెల 30వ తేదిన ఇందిరాపార్కు వద్ద తలపెట్టే దర్ణాను విజయవంతం చేయాలని *గ్రామీణ కేబుల్ ఆపరేటర్ ల సంఘం రాష్ట్ర కమిటీ కన్వీనర్ బడుగుల ఉపేందర్ డిమాండ్ చేశారు.* సోమవారం స్థానిక నకిరేకల్ డివిజన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతుపేద, మధ్య తరగతి సామాన్యులు కేబుల్ టీవీ ఛానెల్స్ దూరమయ్యే విధంగా ధరలను పెంచుతూ ట్రాయ్ నిర్ణయం ఉందని, వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న కేబుల్ టీవీ ఆపరేటర్ వ్యవస్థనే లేకుండా చేస్తూ DTH , Pay Channel Broad Caster Corprate సంస్థలకు కొమ్ము కాస్తూ ట్రాయ్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి కైనా స్వయం ఉపాధి తో నిలబెట్టుకున్న వ్యవస్థను కాపాడాలని , TRAI తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించి కేబుల్ ఆపరేటర్ ల మరియు వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని కోరారు.(ఈ కార్యక్రమంలో) స్థానిక MSO బిచ్చినేపల్లి వెంకటేశ్వర్ రావు గారు, నకిరేకల్, కేతపల్లి,శాలిగౌరారం అధ్యక్షులు శ్రీను గారు,సైదులు గారు,శ్రీరాములు గారు మరియు అన్ని ఊర్ల ఆపరేటర్లురాంమోహన్ రావు గారు,క్రాంతి గారు,వెంకటయ్య గారు, బిక్షపతిగారు,శ్రీను గారు, అశోక్ గారు,సతీష్ గారు,శంకర్ గారు, సైదులు గారు,శ్రీశైలం గారు,వెంకన్న గారు,సురేందర్ గారు, నాగేంద్ర బాబు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here