కేబుల్ పరిశ్రమకు సుభాష్ రెడ్డి మరో కానుక కేబుల్ టీవీ డిజిటైజేషన్ 300 పేజీల సమగ్ర గ్రంధం – కేబుల్ టీవీ వ్యాపార మార్గదర్శి

0
589

తెలంగాణ ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య అధ్యక్షుడు శ్రీ సుభాష్ రెడ్డి కేబుల్ పరిశ్రమ భవిష్యత్తుకోసం, ఈ పరిశ్రమలోని ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల భవిష్యత్తుకోసం మరో అడుగు వేశారు. ఆపరేటర్, తద్వారా ఎమ్మెస్వో బలపడితేనే పరిశ్రమ కలకాలం కళకళలాడుతూ ఉంటుందని ఆలోచించే సుభాష్ రెడ్డి ఎప్పటికప్పుడు ఈ పరిశ్రమ సమాచారాన్ని అందించటానికి కేబుల్ సమాచార్ మాసపత్రికను నెలనెలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మార్కెట్లో తెలుగులో ఇంత సమగ్ర సమాచారం అందించే పత్రిక మరొకటి లేదన్న సంగతి తెలిసిందే.

డిజిటైజేషన్ మొదలైనప్పటినుంచీ దానిమీద పూర్తి సమాచారం అందించటంతోబాటు ఎప్పటికప్పుడు వస్తున్న ప్రభుత్వ నిబంధనలు, ట్రాయ్ నిర్ణయాలు, టిడిశాట్ తీర్పులు సరళమైన తెలుగులో కేబుల్ సమాచార్ అందిస్తూ వస్తున్నది. అయితే, పూర్తిగా డిజిటైజేషన్ కు సంబంధించిన సమాచారాన్నంతా ఒకేచోట అందిస్తూ, మారుమూల ఉండే కేబుల్ ఆపరేటర్ సైతం దీని గురించి తెలుసుకోవాలంటే అంతా ఒకేచోట పుస్తకరూపంలో ఉండాలన్న అబిప్రాయంతో కేబుల్ టీవీ డిజిటైజేషన్ పేరుతో ఒక పుస్తకాన్ని అందించబోతోంది.

ప్రతి ఒక్కరికీ సులభంగా అర్థమయ్యేలా డిజిటైజేషన్ నియమనిబంధనలన్నీ తెలుగులో అందించే ఈ 300 పేజీల పుస్తకం డిజిటైజేషన్ కి సంబంధించిన అన్ని అనుమానాలనూ తీరుస్తుంది. ఎమ్మెస్వోల హక్కులు, బాధ్యతలు, ఆపరేటర్ల హక్కులు, బాధ్యతలు, చందాదారుల హక్కులు, ఆదాయపంపిణీ లాంటి విషయాలన్నీ ఇందులో ఉంటాయి. న్యాయపరమైన చిక్కులు రాకుండా నెట్ వర్క్ నడుపుకోవటానికి , చట్టం ప్రకారం పాటించాల్సిన నియమాలు, నిర్వహించలసిన రిజిస్టర్ల వివరాలు ఇందులో ఉంటాయి. 5 వేల కాపీలు అందుబాటులో ఉండేలా చూస్తున్న ఈ పుస్తకంల మూడు మాసాల పాటు ఉచితంగా కేబుల్ సమాచార్ మాసపత్రిక ను పొందాలనుకుంటే మీ పూర్తి చిరునామాను ఎస్ ఎం స్ చేయండి. మూడు నెల ల పాటు ఉచితంగా కేబుల్ సమాచార్ మాసపత్రికను పొందండి.

మీ యం.సుభాష్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here