సినిమా, టీవీ, ఒటిటి కార్యక్రమాల నిర్మాణానికి కేంద్రం విధి విధానాలు.

0
624

సినిమాలు, టీవీ, ఒటిటి కార్యక్రామల నిర్మాణం త్వరలోనే  మళ్ళీ ప్రారంభమవుతుంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఈ కార్యక్రమాల నిర్మాణ సందర్భంగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను విడుదలచేశారు. ఈ నియమనిబంధనలు పాటిస్తూ షూటింగ్స్ మళ్ళీ పారంభించుకోవటానికి అవకాశమిస్తారు.

ఈ వెసులుబాటు, మార్గదర్శకాల గురించి జావడేకర్ ట్వీట్ చేస్తూ ” ఈ మార్గదర్శకాల వలన నిర్మాణంలో పాల్గొనే నటీనటులకు, టెక్నీషియన్లకు సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుంది  అన్నారు. మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన జాగ్రత్త చర్యల్లో : తక్కువమంది నటీనటులు, సిబ్బందిని వాడుకోవటం, విశ్రాంతికోసం, చివరిదాకా అందుబాటులో ఉండటానికి వాహనాలు సమకూర్చటం లాంటివి ఉన్నాయి.

వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాల వ్యాధులున్న టెక్నీషియన్లు, నటీనటులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలతో నేరుగా సంబంధముండే పనులకు వీరు దూరంగా ఉండాలి.కెమెరా ఎదురుగా ఉండి నటించే వారు తప్ప ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.

* అందరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవటంతో బాటు దాన్ని వాడాలి.

* లోపలికి వచ్చేటప్పుడు, బైటికి వెళ్ళేటప్పుడు విధిగా సంతకం చేయాలి.

* నిర్మాణ సమయంలో ప్రతి ఒక్కరికీ మధ్య కనీసం ఆరడుగుల దూరం ఉండేలా గుర్తులు గీసి భౌతిక దూరం పాటించాలి.

* సందర్శకులు, ప్రేక్షకులు సెట్ లలోకి వెళ్ళటం నిషిద్ధం.

* టెక్నీషియన్లు, హెయిర్ స్టైలిస్ట్ లు పిపిఇ కిట్లు ధరించాలి. విగ్గులు, మేకప్ కిట్లు ఒకరివి మరొకరు వాడకూడదు. వీలైనమ్త వరకు నటీనటులు సొంతగా మేకప్ చేసుకోవాలి.

* సెట్ లో ఎక్విప్ మెంట్ పంచుకొని వాడే వారంతా రబ్బర్ గ్లౌవ్స్ వాడాలి. ప్రాపర్టీస్ వాడకం బాగా తగ్గించాలి. అవసరమైతే శానిటైజ్ చెయ్యాలి.

* లాపెల్ మైకుల వాడకం, పంచుకోవటం నివారించాలి. మైకుల డయాఫ్రమ్స్ తో భౌతికంగా స్పర్శ నివారించాలి.

* ప్రతి ప్రొడక్షన్ కూ ఒక కోవిడ్ సూపర్ వైజర్ ను నియమించుకోవాలి.

* స్థానిక అధికారులనుంచి అవసరమైన అనుమతులు పొందాలి. ఇప్పుడు ప్రకటించిన ఈ నియమావళి వలన త్వరలోనే షూటింగ్స్ ప్రారంభం అవుతాయి. భారత సినిమా, టీవీ, డిజిటల్ నిర్మాతలు లబ్ధిపొందుతారు. ఈ రంగం దాదాపు ఐదు నెలలుగా షూటింగ్స్  పెద్ద ఎత్తున చేపట్టకపోవటం  వలన వేలాది కోట్లు నష్టపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here