వైర్డ్ బ్రాడ్ బాండ్ లో బిఎస్ ఎన్ ఎల్ దే పైచేయి

0
604

ఇంటర్నెట్ లో అత్యధికవాటా వైర్ లెస్ దే అయినా, వైర్డ్ బ్రాడ్ బాండ్ సామర్థ్యాన్ని తక్కువగా అంచనావేయటానికి వీల్లేదు. వాడకం ఎక్కువయ్యేకొద్దీ వైర్ లెస్ నుంచి వైడ్ బ్రాడ్ బాండ్ వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. గడిచిన మూడు నెర్లలకాలంలో కూడా ఇదే ధోరణి కనబడుతోంది. జులై లో ఉన్న వినియోగదారులు 1.72 శాతం పెరగటంతో ఆగస్టునాటికల్లా వైర్డ్ బ్రాడ్ బాండ్ వినియోగదారుల సంఖ్య 2 కోట్ల 4 లక్షల 70 వేలకు చేరింది
టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆగస్టు 31 వరకు ఉన్న టెలికామ్ చందాదారుల జాబితాను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం వైర్డ్ బ్రాడ్ బాండ్ సరఫరాదారులైన బి ఎస్ ఎన్ ఎల్ కు 78 లక్షల 85 వేలమంది చందాదారులు ఉండగా భారతీ ఎయిర్ టెల్ కు 25 లక్షల 30 వేలు, ఏట్రియా కమ్వర్జెన్స్ టెక్నాలజీస్ (ఎసిటి) కి 17 లక్షలు, రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ కి 12 లక్షల 50 వేలు, హాత్ వే డేటాకామ్ కి 10 లక్షల 30 వేల చందాదారులున్నారు.
కోవిడ్ ప్రభావం నుంచి బైటపడుతూ మొత్తం ఇంటర్నెట్ కనెక్టివిటీ (వైర్ లెస్+ వైర్డ్) ఆగస్టు చివరికల్లా పెరుగుదల నమోదు చేసుకుంది. జులై ఆఖరుకు అది 70 కోట్ల 5 లక్షల 40 వేలు ఉండగా ఆగస్టు ఆఖరునాటికి 1.53% పెరుగుదల నమోదు చేసుకుంటూ 71 కోట్ల 61 లక్షల 90 వేలకు పెరిగింది.
మొత్తం మార్కెట్ వాటాలో 98.89% వాటా మొదటి ఐదు సర్వీస్ ప్రొవైడర్లదే కావటం గమనార్హం. వీటిలో రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ 40 కోట్ల 39 లక్షల 20 వేలు, భారతీ ఎయిర్ టెల్ 15 కోట్ల 89 లక్షల 80 వేలు, వోడాఫోన్ ఐడియా 11 కోట్ల 99 లక్షల 10 వేలు, బి ఎస్ ఎన్ ఎల్ 2 కోట్ల 37 లక్షల 50 వేలు, ఏట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ 1 కోటీ 70 లక్షలు ఉన్నాయి. అంటే వైర్డ్ + వైర్లెస్ బ్రాడ్ బాండ్ పరంగా చూసినప్పుడు 56.4% వాటాతో రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ అందరికంటే ముందుండగా 22.2%తో భారతీ ఎయిర్ టెల్, రెండో స్థానంలో 16.74%తో వోడాఫోన్ ఐడియా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here