ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం పైన గౌరవం

0
518

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం పైన గౌరవం ఉంచి, నాయకుల శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచి మన అసోసియేషన్ తో కలిసి ప్రయాణం చేస్తున్న రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్లందరికీ తెలియజేయడం ఏమనగా….
ఈరోజు రాష్ట్ర నాయకత్వం ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ చైర్మన్ గౌరవనీయులైన శ్రీ పూనూరు గౌతమ్ రెడ్డి గారిని కలిసి ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ వేసిన కేబుల్ ఆపరేటర్ల బేసిక్ ప్యాక్ 300 నుండి 350 రూపాయలు పెంపు తీరుపై పడుతున్న ఆర్థిక ఇబ్బందులను, ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని టెక్నికల్ సమస్యలపై వినతి పత్రం సమర్పించడం జరిగింది. చైర్మన్ గారు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించిన పిమ్మట కేబుల్ ఆపరేటర్ల మనుగడకు, అభ్యున్నతికి దోహదపడే విధంగా సుదీర్ఘంగా చర్చలు జరపడం జరిగింది. అందుకుగాను ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ చైర్మన్ శ్రీ గౌతమ్ రెడ్డి గారికి రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల అందరి తరఫున కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

ఆ చర్చల సారాంశం ఏంటంటే…
ఈ ఆగస్టు నెల నుంచే బేసిక్ ప్యాక్ 350 రూపాయల పెంపుదల అనే అంశాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం.
టీవీలో 350 రూపాయలు పెంపుదల స్క్రోలింగ్ ను అప్పటికప్పుడు ఆప్ చేయించడం.
ఈ నెలాఖరులోపు ప్రీపెయిడ్ విధానాన్ని అమలు పరచడానికి మరియు సస్పెండైన బాక్స్ ల అమౌంట్ కేబుల్ ఆపరేటర్ల బిల్లింగ్ లో రాకుండా టెక్నికల్ సిబ్బందితో అప్పటికప్పుడు చర్చలు జరపడం. దానికి టెక్నికల్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉండడం, త్వరిత గతిన సర్వీసింగ్ సెంటర్ లను ఏర్పాటు చేస్తానని తెలపడం కేబుల్ ఆపరేటర్ లకు ఒక శుభ పరిణామం.
బేసిక్ ప్యాక్ లో ఏవేని కొన్ని తెలుగు చానల్స్ యాడ్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని తెలపడం జరిగింది.
అంతేకాక కరోనా వైరస్ కారణంగా కేబుల్ రంగంలోని వ్యక్తులు చాలా మంది చనిపోవడం చాలా బాధాకరం అని వారి కుటుంబాల పట్ల సానుభూతిని వ్యక్తపరుస్తూ, ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ప్రభుత్వానికి లేఖ రాయడం కూడా జరిగిందని తెలపడం ఎంతో హర్షించదగ్గ విషయం.
ఏదేని కారణాల చేత కేబుల్ రంగంలోని వ్యక్తులు చనిపోతే వారికి అసంఘటిత కార్మికుల బీమా వర్తించే విధంగా చర్యలు చేపట్టడానికి వచ్చే వారం లోపు అసోసియేషన్ రాష్ట్ర నాయకులను వెంటబెట్టుకుని ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్లి వారిని ఒప్పించి సాధించుకుందామని తెలపడం ఆయన నాయకత్వ లక్షణాలకి నిదర్శనం.
అంతటితో ఆగక రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్లు అందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయడానికి తనవంతు బాధ్యతను నెరవేర్చాలని కోరగా ఈ అంశం ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలియడంతో అక్కడున్న రాష్ట్ర నాయకులకు అందరికీ ఎంతో ఉద్వేగాన్ని, పట్టలేని ఆనందాన్ని కలిగించిన అంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here