ఎన్ ఎక్స్ టి డిజిటల్-సిటీ నెట్ వర్క్స్ మధ్య మౌలిక సదుపాయాల పంపిణీ ఒప్పందం

0
1208

కేబుల్ పరిశ్రమలో అత్యంత కీలకమైన ఒప్పందం ఒకటి ఎన్ ఎక్స్ టి డిజిటల్-సిటీ నెట్ వర్క్స్ మధ్య జరిగింది. విస్తృతమైన, అత్యాధునిక మౌలిక సదుపాయాలున్న హిందుజా గ్రూప్ వారి హెడ్ ఎండ్ ఇన్ ద స్కై (హిట్స్) వేదిక ఎన్ ఎక్స్ టి డిజిటల్ తన మౌలిక సదుపాయాలను పరిశ్రమలొని ఇతర పంపిణీ సంస్థలతో పంచుకోవటానికి నిరుడు ట్రాయ్ అనుమతించింది. మౌలిక సదుపాయాలు వృధా కాకుండా, ఇతరుల మీద అనవసర భారం పడకుండా పంచుకోవటానికి అనుమతినిస్తూ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) అనుమతించింది.
ఇప్పటిదాకా కొన్ని చిన్న సంస్థలు ఎన్ ఎక్స్ టి డిజిటల్ తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ దేశంలో అతిపెద్ద ఎమ్మెస్వో అయుఇన సిటిఈ నెట్ వర్క్ ఇలా ముందుకువచ్చి ఒప్పందం కుదుర్చుకోవటం కేబుల్ రంగ చరిత్రలో ఒక మైలురాయిగా మిగులుతుంది. రెండు సంస్థలూ సంప్రదాయక పోటీదారులే అయినప్పటికీ, ఇప్పటికే ఉన్న తన మౌలిక సదుపాయాలను వాడుకునే అవకాశం ఇవ్వటం ద్వారా ఎన్ ఎక్స్ టి డిజిటల్ కు, దాని ద్వారా తక్కువ ఖర్చుతో వ్యాపారాభివృద్ధి చేసుకోవటం సిటీ నెట్ వర్క్ కు చాలా లాభదాయకం. నిజానికి అత్యధిక సంఖ్యలో చానల్స్ పంపిణీ చేయటానికి ఎన్ ఎక్స్ టి డిజిటల్ దగ్గర అత్యాధునిక మౌలిక సదుపాయాలున్నాయి.
దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి మందికి పైగా ఎమ్మెస్వోలు ఉండగా, స్వతంత్ర ఎమ్మెస్వోలు, ప్రాంతీయ ఎమ్మెస్వోల చేతుల్లోనే 6 కోట్లకు పైగా కనెక్షన్లున్న సమయంలో ఈ మార్కెట్లో వీళ్ళు ఖర్చు తగ్గించుకోవటానికి ఎన్ ఎక్స్ టి డిజిటల్ తో ఈ విధమైన ఒప్పందాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. టెక్నాలజీ మీద పెద్ద ఎత్తున ఖర్చు చేసిన తమ సంస్థ దేశవ్యాప్తంగా డిజిటల్ కంటెంట్ పంచగలిగే ఏర్పాటు చేసుకున్నదని, సంప్రదాయ కనెక్టివిటీ ఒక సవాలుగా మారిన మార్కెట్లలో తమ నెట్ వర్క్ వాడులోవటానికి సిటీ నెట్ వర్క్ ముందుకు రావటం సంతోషదాయకమని ఎన్ ఎక్స్ టి డిజిటల్ ఎండీ, సీఈవో విన్ స్లే ఫెర్నాండెజ్ వ్యాఖ్యానించారు. పరిశ్రమలో ఇదొక మైలురాయి అవుతుందన్నారు.
నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకుంటూ దేశ వ్యాప్తంగా ఉన్న చందాదారులకు నాణ్యమైన సేవలందించాలన్న సిటీ నెట్ వర్క్స్ వ్యూహంలో భాగంగానే ఈ ఒప్పందం కుదుర్చుకుంది. కనెక్టివిటీ ఖర్చు తగ్గటం, ప్రస్తుతం ఉన్న మార్కెట్లలో ఎలాంటి అవరోధాలూ లేకుండా అవిచ్ఛిన్నంగా సేవలందించటం సాధ్యమవుతుందని ఆ సంస్థ భావిస్తోంది. ఎన్ ఎక్స్ టి డిజిటల్ మౌలిక సదుపాయాలు వాడుకుంటూ సిటీ నెట్ వర్క్స్ స్థానిక కేబుల్ ఆపరేటర్లకు తన సిగ్నల్స్ పంపుతుంది. బ్రాడ్ బాండ్ లాంటి సేవల విస్తరణకు కూడా ఇది ఉపయోగపడుతుందని సిటీ నెట్ వర్క్స్ సీఈవో అనిల్ మల్హోత్రా అభిప్రాయపడ్దారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here