డిడి ఫ్రీడిష్ లో మరో 5 ఛానల్స్ కు చోటు

0
741

ప్రసార భారతి ఆధ్వర్యంలోని ఉచిత డీటీ హెచ్ వేదిక డిడి ఫ్రీడిష్ లో తాజాగా ఐదు చానల్స్ వచ్చి చేరాయి. తాజాగా జరిగిన ఈ-వేలంలో ఐదు ఎం పెగ్-2 స్లాట్స్ నింపారు. హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్ ఇషారా టీవీ, టెలీషాపింగ్ చానల్ నాప్ టాల్, మ్యూజిక్ చానల్ షో బాక్స్ , మరాఠీ చానల్ సన్ మరాఠీ , బెంగాలీ చానల్ ఎంటర్ 10 విజయవంతంగా వేలంలో తమ చానల్స్ కు స్లాట్స్ సంపాదించుకోగలిగాయి. ఈ చానల్స్ ఈ నెల 16 నుంచి డిడి ఫ్రీడిష్ లో అందుబాటులో ఉంటాయి.
ఈ కేటాయింపు 2021 ఆగస్టు 16 నుంచి 2022 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. వేలంలో విజేతలు ఆర్య వాయిదాలలో వేలం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ప్రసార భారతి తెలియజేసింది. లైసెన్స్ పొందిన శాటిలైట్ చానల్స్ కు మాత్రమే ప్రసారభారతి వారి వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. జులై 31 న ఫ్రీడిష్ లో ఖాళీ ఉన్న ఐదు స్లాట్స్ ను ప్రకటించగా ఈ- వేలం ద్వారా చానల్స్ కు అవకాశం కల్పించారు. ఐదు విభాగాలలో దరఖాస్తులు స్వీకరించారు. రిజర్వ్ ధర ప్రకటించిన తరువాత అది కనీస ధరగా వేలం జరిగింది.
ఇందులో ఎ ప్లస్ విభాగం కింద అన్నీ హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్, ఎ విభాగంలో అన్నీ హిందీ సినిమా చానల్స్ , బి విభాగంలో అన్నీ హిందీ మ్యూజిక్ చానల్స్, హిందీ స్పోర్ట్స్ చానల్స్, భోజ్ పురి జనరల్ ఎంటర్టైన్మెంట్, సినిమా చానల్స్, హిందీ టెలీషాపింగ్ చానల్స్ ఉండగా సి విభాగంలో హిందీ, ఇంగ్లీష్ , పంజాబీ న్యూస్ చానల్స్, డి విభాగంలో మిగిలిన అన్ని రకాల, అన్ని భాషల, ప్రాంతీయ టెలీషాపింగ్ చానల్స్ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here